Begin typing your search above and press return to search.

చిరు పాటలకు కోహ్లీ డాన్స్ వేసేవాడు..!

ఆ పాటలకు డాన్స్ లు చేయడంతో పాటు, తన ఫేవరెట్‌ ప్లే లిస్ట్‌ లో కూడా చిరంజీవి పాటలకు చోటు కల్పించాడు అంటూ ద్వారకా రవితేజ అన్నాడు.

By:  Tupaki Desk   |   17 July 2024 10:52 AM IST
చిరు పాటలకు కోహ్లీ డాన్స్ వేసేవాడు..!
X

టీం ఇండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ తన అండర్‌ 15 రోజుల్లో మన టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి పాటలను బాగా ఆస్వాదించేవాడట. ఆ పాటలకు డాన్స్ లు చేయడంతో పాటు, తన ఫేవరెట్‌ ప్లే లిస్ట్‌ లో కూడా చిరంజీవి పాటలకు చోటు కల్పించాడు అంటూ ద్వారకా రవితేజ అన్నాడు.

ఫస్ట్‌ క్లాస్‌ క్రికెటర్‌ అయిన రవితేజ గతంలో కోహ్లీకి సహచరుడు. అండర్‌ 15 రోజుల్లో కోహ్లీ తన కు రూమ్‌మెంట్ అని, ఆ సమయంలో ఇద్దరం కూడా ఒకరిని ఒకరం చిరు చిరు అంటూ పిలుచుకునే వాళ్లం అన్నాడు. ఆరు సంవత్సరాల తర్వాత కలిసి నన్ను 'చిరు కైసే హై తు' అన్నాడు. రూమ్ లో నేను టీవీలో చిరంజీవ పాటలను పెడితే వాటికి కోహ్లీ డాన్స్ వేస్తూ ఎంజాయ్‌ చేసేవాడని చెప్పుకొచ్చాడు.

అండర్ 19 భారత జట్టు లో మరియు ఇండియా ఏ జట్టు లో కూడా కోహ్లీ తో కలిసి ఇండియన్ జర్సీ ని ద్వారకా రవితేజ షేర్ చేసుకున్నాడు. కోహ్లీ తో తనకు ఉన్న అనుబంధం గురించి ఇటీవల ఒక సందర్భంలో షేర్‌ చేసుకున్న రవితేజ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఇటీవల టీ20 వరల్డ్‌ కప్ గెలవడం లో కీలక పాత్ర పోషించిన కోహ్లీ పొట్టి క్రికెట్‌ కి గుడ్‌ బై చెప్పాడు. భవిష్యత్తులో మరిన్ని విజయాలను సొంతం చేసుకోవడం కోసం సిద్ధం అవుతున్నట్లు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కోహ్లీ ప్రకటించిన విషయం తెల్సిందే.

ఇండియన్‌ క్రికెట్‌ స్టార్ కోహ్లీ మన మెగాస్టార్‌ స్టార్‌ పాటలకు డాన్స్ చేసేవాడట అంటూ సోషల్‌ మీడియాలో మెగా ఫ్యాన్స్‌ ద్వారకా రవితేజ వ్యాఖ్యలను తెగ షేర్‌ చేస్తున్నారు. ప్రస్తుతం రవితేజ వ్యాక్యలు వైరల్‌ అవుతున్నాయి.