Begin typing your search above and press return to search.

ఎయిడ్స్ వ‌చ్చింద‌ని ప్ర‌చారం చేసారు.. హీరో ఆవేద‌న‌!

'నేను సినిమా పరిశ్రమకు దూరంగా ఉన్న సమయంలో నా గురించి, నా వ్యక్తిగత జీవితంపై రకరకాల పుకార్లు వినిపించాయి. 90వ దశకంలో నాకు ఎయిడ్స్ సోకిందని పుకార్లు వచ్చాయి.

By:  Tupaki Desk   |   9 Jun 2024 5:31 AM GMT
ఎయిడ్స్ వ‌చ్చింద‌ని ప్ర‌చారం చేసారు.. హీరో ఆవేద‌న‌!
X

1977లో కోకిల సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యారు మోహ‌న్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. ఇందులో తన నటనకు ప్రేక్షకులు 'కోకిల మోహన్' అని ముద్దుగా పిలుచుకున్నారు. తన వరుస హిట్ల తర్వాత సిల్వర్ జూబ్లీ స్టార్ అనే బిరుదును సంపాదించుకున్నాడు. 'కోకిల' లాంటి క్లాసిక్ చిత్రంలో శోభ‌న స‌ర‌స‌న న‌టించిన మోహ‌న్ ఛామింగ్ లుక్స్, అద్భుత న‌ట‌న‌కు ప్ర‌త్యేకించి మ‌హిళా ఫ్యాన్స్ ఏర్ప‌డ్డారు. ఇందులో ఇళ‌య‌రాజా స్వ‌ర‌ప‌రిచిన పాట‌లు, వేటూరి సాహిత్యం ఎంతో అద్భుతం. మోహన్ సౌత్‌లో 40 సంవత్సరాలకు పైగా న‌టుడిగా కొన‌సాగారు. ప‌లు చిత్రాల్లో అత‌డి న‌ట‌న‌కు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు ద‌క్కాయి.

కొంత‌కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఆయన మళ్లీ కొత్త ప్రొడక్షన్‌లో 'హరా' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రం జూన్ 7న విడుదలైంది. తాజా ప్రచార కార్యక్రమాల్లో మోహ‌న్ త‌న‌పై సాగిన ఒక దుష్ప్ర‌చారం గురించి ప్ర‌స్థావించారు. తాను ఇటీవల చిత్ర పరిశ్రమకు దూరంగా ఉన్న సమయంలో తనకు ఎయిడ్స్ ఉంద‌నే పుకార్లు షికార్ చేసాయ‌ని అన్నారు. ఇంటర్వ్యూలో మోహన్ మాట్లాడుతూ.. ''నేను సినిమా పరిశ్రమకు దూరంగా ఉన్న సమయంలో నా గురించి, నా వ్యక్తిగత జీవితంపై రకరకాల పుకార్లు వినిపించాయి. 90వ దశకంలో నాకు ఎయిడ్స్ సోకిందని పుకార్లు వచ్చాయి. అది విని నా అభిమానులు ఆశ్చర్యపోయారు. నన్ను కలవడానికి మా ఇంటికి వచ్చారు. ఇది నా కుటుంబం స్నేహితులకు షాక్ ఇచ్చింది'' అని అన్నారు.

నా కుటుంబం, స్నేహితులకు నిజం తెలుసు.. దాని గురించి నాకు ఎలాంటి కోప‌తాపాలు లేవు. అది నిజమైతే నాకు చాలా బాధగా ఉండేది కాని అది నిజం కాదు క‌దా! అని అన్నారు మోహన్. 80వ దశకంలో కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడు, మోహన్ సినిమా పరిశ్రమ నుండి అదృశ్యమయ్యాడు. దీంతో అత‌డిపై రకరకాల పుకార్లు వచ్చాయి.

మోహన్ కథానాయకుడిగా నటించిన హరా చిత్రం ఇటీవ‌లే విడుదలైంది. ఈ చిత్రంలో యోగి బాబు, మొట్టా రాజేంద్రన్, మైమ్ గోపి, సురేష్ మీనన్, చారు హాసన్ త‌దిత‌రులు న‌టించారు. ఈ చిత్రానికి దర్శకత్వం- రచన విజయ్ శ్రీ జి. ప్రముఖ నిర్మాత కోవై ఎస్పీ మోహన్‌రాజ్ నిర్మించగా, రశాంత్ అర్విన్ సంగీతం సమకూర్చారు. 90ల‌లో మోహన్ అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రాలలో నటించారు. నూరవతు నాల్, నెంజతై కిల్లాతే, మునియాన మదారి మరియు పయనంగల్ ముడివత్తిల్లై లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ల‌లో అత‌డు న‌టించాడు.