వీరమల్లు మాస్ బీట్ 'కొల్లగొట్టినాదిరో'....పవన్ కళ్యాణ్‌తో అనసూయ అదిరిపోయే స్టెప్పులు....
ఇప్పుడు, ఆ ఉత్సాహం ఇంకా పెంచేలా సెకండ్ సింగిల్ ప్రొమోతో మేకర్స్ ముందుకు వచ్చారు. తాజాగా విడుదలైన "కొల్లగొట్టినాదిరో" పాట ప్రొమో చూస్తుంటే.. అది పక్కా ఊరమాస్ సాంగ్ గా వస్తుందని స్పష్టమవుతోంది.
By: Tupaki Desk | 21 Feb 2025 10:10 AM GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి రాబోతున్న నెక్స్ట్ మూవీ హరిహర వీరమల్లు సినిమాపై అంచనాలు పెరిగినట్టే పెరిగి మళ్ళీ తగ్గుతున్నాయి. కానీ మేకర్స్ మాత్రం ఎక్కడా డౌన్ కాకుండా ఏదో ఒక అప్డేట్ అయితే ఇస్తున్నారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో మొదలైన ఈ సినిమాకు జ్యోతిక్రిష్ణ ఫీనిషింగ్ టచ్ ఇస్తున్నారు. ఇక హై బడ్జెట్ లో రూపొందుతున్న ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామా, పవన్ అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పరిచింది.

ఈ సినిమా షూటింగ్ కొంతకాలం పవన్ రాజకీయాల కారణంగా వాయిదా పడినా, ఇప్పుడు షూటింగ్ చివరి దశలో ఉంది. ఇప్పటికే ఫస్ట్ సింగిల్ "మాట వినాలి" పాట విడుదలై మంచి స్పందనను దక్కించుకుంది. పవన్ కళ్యాణ్ స్వయంగా పాడిన ఈ పాట ఆయన అభిమానులను కిక్కెక్కించింది. పాటలో పవన్ స్టైల్, కీరవాణి మ్యూజిక్ కాంబినేషన్ అదిరిపోయిందని నెటిజన్లు సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపించారు.
ఇప్పుడు, ఆ ఉత్సాహం ఇంకా పెంచేలా సెకండ్ సింగిల్ ప్రొమోతో మేకర్స్ ముందుకు వచ్చారు. తాజాగా విడుదలైన "కొల్లగొట్టినాదిరో" పాట ప్రొమో చూస్తుంటే.. అది పక్కా ఊరమాస్ సాంగ్ గా వస్తుందని స్పష్టమవుతోంది. ప్రొమోలో పవన్ మాస్ లుక్‌లో కర్ర పట్టుకుని స్టెప్ వేస్తూ ముందుకు రావడం అభిమానులను పిచ్చెక్కిస్తోంది. బ్యాండ్ వాయిస్తుంటే, అనసూయ, పూజిత పొన్నాడల లుక్ కూడా మరింత జోష్ ను తీసుకొచ్చింది.
చిచ్చర పిడుగు లాంటి పాట వస్తుందనేది ఈ ప్రొమోతో ఖాయం అయ్యింది. మేకర్స్ ప్రకటన ప్రకారం, ఈ సెకండ్ సింగిల్ ఫిబ్రవరి 24న సాయంత్రం 3 గంటలకు విడుదల కానుంది. ఈ వార్తతో పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పండుగ చేసుకుంటున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం. కీరవాణి ఈ పాటను పక్కా మాస్ బీట్ తో అందించినట్లు తెలుస్తోంది. పీరియాడిక్ సినిమాల్లో ఇలాంటి మాస్ ఎలిమెంట్స్ రావడం చాలా అరుదు, కానీ క్రిష్ ఈ సినిమాలో పవన్ స్టైల్‌కి తగ్గట్టుగా అన్ని మసాలాలు కలిపినట్లు కనిపిస్తోంది.
ఇక సినిమా కాస్టింగ్ విషయానికి వస్తే, నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా, బాలీవుడ్ విలక్షణ నటుడు బాబీ డియోల్ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. వారి మధ్య కీలక సన్నివేశాలు సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఎపిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ప్రొడ్యూసర్ ఏ.ఎమ్. రత్నం ఖర్చుకు వెనుకడకుండా అత్యధిక స్థాయి సెట్‌లు వేశారని సమాచారం. మొత్తానికి, హరి హర వీరమల్లు హైప్ ఫస్ట్ సింగిల్ తో మొదలై, ఇప్పుడు సెకండ్ సింగిల్ తో మరింత పెరిగింది. మార్చి 28న సినిమా థియేటర్లలోకి రానున్నట్లు మరోసారి మేకర్స్ క్లారిటీ అయితే ఇచ్చారు. కానీ ఇంకా షూటింగ్ కాస్త పెండింగ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఆలస్యం అయితే మే నెలలో రావచ్చని టాక్.