Begin typing your search above and press return to search.

పంజా బ్యూటీ ఇప్ప‌టికీ అదే స‌న్నివేశం!

అయితే సారా జేన్ సోష‌ల్ మీడియాల్లో నిరంత‌రం అభిమానుల‌కు ట‌చ్‌లో ఉంది

By:  Tupaki Desk   |   23 Sep 2024 3:37 AM GMT
పంజా బ్యూటీ ఇప్ప‌టికీ అదే స‌న్నివేశం!
X

సారా జేన్ డ‌యాస్ `పంజా` చిత్రంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌ర‌స‌న న‌టించింది ఈ భామ‌. కానీ తొలి చిత్ర‌మే డిజాస్ట‌ర్ అవ్వ‌డంతో అటుపై తీవ్రంగా నిరాశ‌లో కూరుకుపోయింది. సెంటిమెంట్ ప‌రిశ్ర‌మ‌లో అవ‌కాశాలు అంత తేలిగ్గా రాలేదు. అటుపై కోలీవుడ్ కి వెళ్లిపోయింది. కానీ అక్క‌డా ఆశించినన్ని సినీ అవ‌కాశాలు రాలేదు. పెద్ద స్టార్ల స‌ర‌స‌న ఛాన్సులైతే రాలేదు. కెరీర్ లో అడ‌పాద‌డ‌పా సినిమాలు చేసినా ఈ అమ్మ‌డికి ల‌క్ ఫేవ‌ర్ చేయ‌లేదు. దీంతో నెమ్మ‌దిగా తెర‌కు దూర‌మ‌వుతోంది.


అయితే సారా జేన్ సోష‌ల్ మీడియాల్లో నిరంత‌రం అభిమానుల‌కు ట‌చ్‌లో ఉంది. త‌న‌కు సంబంధించిన వ్య‌క్తిగ‌త‌, వృత్తిగ‌త విష‌యాల‌ను సారా ఫ్యాన్స్ కోసం ఇన్‌స్టాలో షేర్ చేస్తోంది. అవ‌న్నీ వేగంగా వైర‌ల్ అయిపోతున్నాయి. తాజాగా ఈ బ్యూటీ త‌న‌కు కాఫీ మీద ఉన్న అభిరుచిని చాటుకుంటూ కాఫీ గ్లాస్ తో క‌నిపించింది. వేకువ ఝామున కాఫీ తాగుతూ తాను ఎలా టైమ్ స్పెండ్ చేస్తుందో కూడా ఈ ఫోటోగ్రాఫ్ లో క‌నిపిస్తోంది.

2023లో సారా న‌టించిన మేడ్ ఇన్ హెవెన్ సీజ‌న్ 2 అంద‌రినీ ఆక‌ట్టుకుంది. ఇందులో సారా ష‌టిల్డ్ పెర్ఫామెన్స్ ఎంత‌గానో మెప్పించింది. త‌న న‌ట‌న‌కు వ‌చ్చిన ప్ర‌శంస‌ల‌కు సారా సంతోషం వ్య‌క్తం చేసింది. నా మార్గంలో వచ్చిన వైవిధ్యమైన అవ‌కాశాల‌కు నేను ఎప్పుడూ కృతజ్ఞురాలిని. ప్రతిభావంతులైన వ్యక్తుల కోసం నేను పని చేసే అవకాశం ఉంది. నేను ఆశీర్వాదంగా భావిస్తున్నాను. గర్విస్తున్నాను. ధన్యవాదాలు యూనివ‌ర్శ్.. దేవునికి ధన్యవాదాలు... అని అంది.