Begin typing your search above and press return to search.

ప్రభాస్ - హోంబలే.. లైన్ లోకి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్

ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ప్రభాస్, హోంబలే ఫిల్మ్స్ కాంబినేషన్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

By:  Tupaki Desk   |   6 Dec 2024 8:30 PM GMT
ప్రభాస్ - హోంబలే.. లైన్ లోకి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్
X

ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ప్రభాస్, హోంబలే ఫిల్మ్స్ కాంబినేషన్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సలార్ మూవీతో ప్రభాస్, హోంబలే ఫిల్మ్స్‌కు సంబంధించిన అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈ సక్సెస్‌తో ప్రభాస్, హోంబలే కాంబో మరిన్ని ప్రాజెక్టులకు రెడీ అవుతుందని టాక్ వినిపిస్తోంది. తాజా సమాచారం ప్రకారం, హోంబలే ఫిల్మ్స్‌తో ప్రభాస్ మొత్తం మూడు సినిమాలు చేయబోతున్నట్లు సమాచారం.

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ 2 ప్రాజెక్ట్ ఇప్పటికే సెట్స్ పైనుంది. ఇది కాకుండా నీల్ ప్రభాస్ తో మరో సినిమా చేయనున్నారు. ఇక మరో రెండు ప్రాజెక్ట్స్ కోసం చర్చలు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టులకు దర్శకుల ఎంపికపై హోంబలే, ప్రభాస్ కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది.

ప్రస్తుతం లోకేష్ సూపర్ స్టార్ రజనీకాంత్‌తో కూలీ అనే సినిమా చేస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ పూర్తయిన వెంటనే ఖైదీ 2, రోలెక్స్, విక్రమ్ 2 సినిమాటిక్ యూనివర్స్ లో చేస్తానని అన్నాడు. అలాగే టాలీవుడ్ స్టార్ హీరోతో కూడా ఒక సినిమా చర్చల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ప్రభాస్‌తో ఒక భారీ పాన్ ఇండియా మూవీ చేయనున్నట్లు సమాచారం. లోకేష్ కనగరాజ్ గతంలో విక్రమ్, ఖైదీ, లియో వంటి హిట్ మూవీస్‌తో తన ప్రతిభను నిరూపించుకున్నారు.

ఇక లోకేష్ డైరెక్షన్‌లో ప్రభాస్ సినిమా అంటే అంచనాలు ఆకాశాన్నంటడం ఖాయం. ఈ కాంబినేషన్‌పై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఇక ప్రభాస్ ప్రస్తుత ప్రాజెక్టుల విషయానికొస్తే, ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ అనే హారర్ కామెడీ చేస్తున్నాడు. ఈ చిత్రం 2025 సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

అంతేకాకుండా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2898 AD పార్ట్ 2 షూటింగ్‌ను ప్రభాస్ పూర్తి చేయాల్సి ఉంది. ఈ చిత్రం 2027లో విడుదలకు కవచ్చని సమాచారం. అలాగే హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ ప్రాజెక్ట్ కూడా లైన్‌లో ఉంది. ఈ సినిమాల్లో ప్రతి దానిపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ప్రభాస్ హోంబలే కాంబినేషన్, లోకేష్ కనగరాజ్ వంటి స్టార్స్‌తో కలిసి ప్రాజెక్ట్స్ ప్లాన్ చేయడం సినిమా ప్రేమికులకు గొప్ప పండగే. ఈ కాంబినేషన్‌పై త్వరలోనే అధికారిక అప్డేట్స్ వెలువడతాయనే ఆశతో అభిమానులు ఎదురు చూస్తున్నారు.