అతనిపైనే.. వెయ్యి కోట్ల ఆశ..
ఇండియన్ బాక్సాఫీస్ మార్కెట్ ని కొంత వరకు ప్రభావితం చేసే కోలీవుడ్ ఇండస్ట్రీకి మాత్రమే ఈ 1000 కోట్ల కలెక్షన్స్ అనేది అందని ద్రాక్షగా ఉంది. ‘భారతీయుడు 2’, ‘కంగువా’ మూవీతో ఆ ఫీట్ అందుకుంటారని అనుకున్నారు.
By: Tupaki Desk | 12 Dec 2024 5:30 AM GMTఇండియన్ బాక్సాఫీస్ హిస్టరీలో 1000 కోట్ల క్లబ్ కలెక్షన్స్ ఎక్కువ సార్లు అందుకున్న ఇండస్ట్రీగా టాలీవుడ్ ఉంది. టాలీవుడ్ నుంచి ‘బాహుబలి 2’, ‘ఆర్ఆర్ఆర్’, ‘కల్కి2898ఏడీ’, ‘పుష్ప 2’ చిత్రాలు ఈ క్లబ్ లో చేరాయి. బాలీవుడ్ నుంచి షారుఖ్ ఖాన్ ‘పఠాన్’, ‘జవాన్’ సినిమాలు 1000 కోట్ల క్లబ్ లో చేరాయి. అలాగే అమీర్ ఖాన్ ‘దంగల్’ కూడా 1000 కోట్ల క్లబ్ లో చేరింది. శాండిల్ వుడ్ నుంచి ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ ఈ క్లబ్ లో చేరిపోయింది.
ఇండియన్ బాక్సాఫీస్ మార్కెట్ ని కొంత వరకు ప్రభావితం చేసే కోలీవుడ్ ఇండస్ట్రీకి మాత్రమే ఈ 1000 కోట్ల కలెక్షన్స్ అనేది అందని ద్రాక్షగా ఉంది. ‘భారతీయుడు 2’, ‘కంగువా’ మూవీతో ఆ ఫీట్ అందుకుంటారని అనుకున్నారు. కానీ అంచనాలు తలక్రిందులయ్యాయి. కోలీవుడ్ కి ఇప్పుడు ఉన్న ఒకే ఒక్క హోప్ లోకేష్ కనగరాజ్. టాలీవుడ్ లో రాజమౌళి, సుకుమార్ తర్వాత ఆ స్థాయిలో టాలెంట్ ఉన్న డైరెక్టర్ గా లోకేష్ కి పేరుంది. ఈ జెనరేషన్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే కథలతో లోకేష్ వరుస సక్సెస్ లు అందుకుంటున్నారు.
‘ఖైదీ’ నుంచి ‘లియో’ వరకు వచ్చిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్స్ గానే నిలిచాయి. ‘లియో’ మూవీ 600+ కోట్ల వరకు వచ్చి ఆగిపోయింది. అతని కథలకి పాన్ ఇండియా అప్పీల్ అయితే ఉంటుంది. కానీ 1000 కోట్ల క్లబ్ లో చేరలేకపోవడానికి క్యాస్టింగ్ బలమైన కారణం అనే మాట వినిపిస్తోంది. టాలీవుడ్ కి ప్రభాస్, అల్లు అర్జున్ లాంటి పాన్ ఇండియా స్టార్స్ ఉన్నారు. వీరితో సినిమాలు పడితే 1000 కోట్లు గ్యారెంటీ అనే టాక్ పబ్లిక్ లోకి వెళ్ళిపోయింది.
లోకేష్ కి ఇలాంటి పాన్ ఇండియా స్టార్స్ లేరు. లియో సినిమాపై అంచనాలు భారీగా ఉన్న హీరో విజయ్ కి నార్త్ లో పెద్దగా మార్కెట్ లేకపోవడం ఆ మూవీ భారీ కలెక్షన్స్ అందుకోలేకపోయింది. అయితే లోకేష్ కనగరాజ్ చేతిలో ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్ ఉన్న సూపర్ స్టార్ రజినీకాంత్ ఉన్నారు. ఆయనతో ‘కూలీ’ సినిమాని లోకేష్ చేస్తున్నారు. ఈ సినిమా మీద అంచనాలు పెంచగలిగితే కచ్చితంగా 1000 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయం అని అనుకుంటున్నారు.
ఒక వేళ ‘కూలీ’ సినిమా ఆ క్లబ్ లో చేరకపోతే లోకేష్ కనగరాజ్ ప్రభాస్ తో మూవీ చేసేంత వరకు కోలీవుడ్ ఇండస్ట్రీ ఎదురుచూడాల్సిందే. తమిళ్ ఆడియన్స్ కి ఒక బ్యాడ్ అలవాటు ఉంది. తమిళ్ డైరెక్టర్ అయిన కూడా తమ తమిళ్ హీరోలతో మూవీస్ చేస్తేనే భారీ సక్సెస్ లు ఇస్తారు. ఇతర భాష హీరోలతో సినిమాలు చేస్తే తమిళ ఆడియన్స్ పెద్దగా ఆసక్తి చూపించరు. ఈ విషయం చాలా సార్లు ప్రూవ్ అయ్యింది. అయితే అక్కడి ఆడియన్స్ కూడా ఇతర భాష హీరోలని స్వాగతిస్తే ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి స్టార్స్ తో కోలీవుడ్ దర్శకులు కూడా పాన్ ఇండియా మార్కెట్ లో సత్తా చాటే ఛాన్స్ ఉంటుంది. మరి కోలీవుడ్ కు మొదటి 1000 కోట్లు అందించే హీరోగా ఎవరు నిలుస్తారో చూడాలి.