2025 బోణీ అదిరింది..ఆ రికార్డు సాధ్యమేనా?
కోలీవుడ్ కి ఇంత వరకూ సరైన పాన్ ఇండియా సక్సెస్ ఒక్కటీ లేదు. 1000 కోట్ల క్లబ్ లో చేరిన చిత్రం దరిదాపుల్లో కూడా కనిపించలేదు.
By: Tupaki Desk | 31 Jan 2025 6:30 AM GMTకోలీవుడ్ కి ఇంత వరకూ సరైన పాన్ ఇండియా సక్సెస్ ఒక్కటీ లేదు. 1000 కోట్ల క్లబ్ లో చేరిన చిత్రం దరిదాపుల్లో కూడా కనిపించలేదు. గత ఏడాది అయినా అలాంటి సినిమా ఒక్కటైనా పడుతుందని చాలా ఆశలు పెట్టుకున్నారు గానీ పనవ్వలేదు. వెయి కోట్ల సంగతి పక్కనబెడితే గత ఏడాది పరిశ్రమ తీవ్ర నష్టాల్లోనే కనిపిస్తుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. 2024 లో కోలీవుడ్ లో 224 సినిమాలు నిర్మిస్తే వాటిలో కేవలం 20 లోపు సినిమాలు మాత్రమే సక్సెస్ బాట పట్టినట్లు తెలుస్తోంది.
అంటే కోలీవుడ్ కి గత ఏడాది నష్టం ఏ స్థాయిలో వచ్చి ఉంటుందో అంచనా వేయోచ్చు. భారీ అంచనాల మధ్య వందల కోట్ల రూపాయలు పెట్టుబడితో నిర్మించిన సినిమాలు 50 కోట్లు కూడా వసూళ్లు తెలేకపోయియి? అంటే పరిస్థితి ఎంత ఆందోళన కరంగా ఉందో అద్దం పడుతుంది. సూర్య నటించిన `కంగువ`పై ఇండస్ట్రీ చాలా అంచనాలు పెట్టుకుంది. హిట్ అయితే 2000 కోట్లు పక్కా అనుకున్నారు. కానీ తొలి షోతోనే కంగువ తేలిపోయింది.
100 కోట్లు రివకరీ చేయడానికి కిందా మీదా పడిందా చిత్రం. `ఇండియన్ 2` కూడా భారీ అంచనాల మధ్య విడుదలై డిజాస్టర్ గా మారింది. హిట్ అయితే ఇండియన్ 2 వసూళ్లు గెస్ చేయని విధంగా ఉండేవి. కానీ ప్లాప్ తో బాక్సాఫీస్ వద్ద తేలిపోయింది. రజనీకాంత్ నటించిన `వెట్టయాన్`, గెస్ట్ రోల్ పోషించిన `లాల్ సలామ్` మ్యాజిక్ చేస్తాయనుకుంటే అవి చతికిల పడ్డాయి. తలపతి విజయ్ నటించిన `ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్` మాత్రం కోలీవుడ్ వరకూ పర్వాలేద నపించినా? ఇతర భాషల్లో డిజాస్టర్ అయింది.
ఇలా భారీ బడ్జెట్ సినిమాల ఫలితాలు తారుమారు అవ్వడంతో? కోలీవుడ్ కి గత ఏడాది భారీ నష్టాలు తప్పలేదు. అయితే 2025 లో మాత్రం మెరుగైన ఫలితాలకు అవకాశం కనిపిస్తుంది. ఆరంభం కూడా విశాల్ `మదగజరాజా`తో అదరగొట్టింది. ఆ సినిమా 60 కోట్ల వసూళ్లను సాధించింది. 12 ఏళ్ల క్రితం నాటి సినిమా ఇది. రిలీజ్ అలస్యమైనా మంచి ఫలితాలతో ఇండస్ట్రీలో జోష్ నిపింది. `కూలీ`, `సర్దార్ -2` సూర్య నటిస్తోన్న44, 45 సినిమాలు, విజయ్ `జన నాయగన్`, కమల్ హాసన్ థగ్ లైప్`, `ఇండియన్ -3` లాంటి చిత్రాలు భారీ అంచనాలతో రిలీజ్ అవుతున్నాయి.