Begin typing your search above and press return to search.

వందల కొద్దీ సినిమాలు.. సక్సెస్ లు మాత్రం..!

పరిశ్రమ బాగుంటే సినిమాలు ఆడాలి.. ఏడాదికి రిలీజయ్యే వందల కొద్దీ సినిమాల్లో కనీసం ఒక 20, 30 శాతం సినిమాలు ఆడినా పరిశ్రమ బాగుంటుంది కానీ ఆ పర్సెంటేజ్ ఇయర్ ఇయర్ కి పడిపోతుంది.

By:  Tupaki Desk   |   30 Jan 2025 4:09 AM GMT
వందల కొద్దీ సినిమాలు.. సక్సెస్ లు మాత్రం..!
X

పరిశ్రమ బాగుంటే సినిమాలు ఆడాలి.. ఏడాదికి రిలీజయ్యే వందల కొద్దీ సినిమాల్లో కనీసం ఒక 20, 30 శాతం సినిమాలు ఆడినా పరిశ్రమ బాగుంటుంది కానీ ఆ పర్సెంటేజ్ ఇయర్ ఇయర్ కి పడిపోతుంది. టాలీవుడ్ పరిస్థితి కాస్త బెటర్ అన్నట్టే ఉండగా పక్కనే ఉన్న కోలీవుడ్ పరిస్థితి మాత్రం దారుణంగా మారింది. 2024 లో కోలీవుడ్ పరిశ్రమకు దాదాపు 1000 కోట్ల దాకా నష్టం వాటిల్లింది. లాస్ట్ ఇయర్ కోలీవుడ్ లో కూడా బాక్సాఫీస్ హిట్లు నిలిచినా వందల సంఖ్యలో సినిమాలు రిలీజైతే చేతి వేళ్లతో లెక్క పెట్టేలా హిట్లు, సూపర్ హిట్లు పడ్డాయి.

ముఖ్యంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలు నిరాశపరచడంతో ఈ పరిస్థితికి వచ్చిందని చెప్పొచ్చు. కోలీవుడ్ లో 2024 లో అందిన సమాచారం మేరకు 241 సినిమాలు రిలీజ్ కాగా వాటిలో కేవలం 18 సినిమాలు మాత్రమే హిట్ అయ్యాయి. 240 సినిమాలకు 3 వేల కోట్ల దాకా ఖర్చు కాగా 1000 కోట్ల పైన లాస్ వచ్చినట్టు తెలుస్తుంది. కోలీవుడ్ లో ఈ ఇయర్ క్రేజీ సినిమాలు వస్తున్నాయి. రాబోతున్న సినిమాలైనా సరే తమిళ పరిశ్రమని ఒడ్డున చేరుస్తాయా లేదా అన్నది చూడాలి.

2024లో భారీ అంచనాలతో వచ్చిన సూర్య కంగువ, కమల్ హాసన్ భారతీయుడు 2 సినిమాలు తీర్వ్రంగా నిరాశపరిచాయి. రజినీకాంత్ వేట్టయ్యన్ కాస్త బెటర్ అనిపించినా అది కూడా భారీ హిట్ సాధించలేదు. ఇదే లిస్ట్ లో విజయ్ గోట్ సినిమా కూడా చేరుతుంది. ఆ సినిమా కూడా ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేదు. రిలీజైన 240 సినిమాల్లో 150 సినిమాలైతే కనీసం పబ్లిసిటీ ఖర్చులు కూడా రాబట్టలేకపోయాయని తెలుస్తుంది.

స్టార్ సినిమాలతో పోల్చితే లాస్ట్ ఇయర్ చిన్న సినిమాలైన గరుడన్, డిమోంటీ కాలనీ 2, వాజై, లబ్బర్ పందు సినిమాలు సక్సెస్ అందుకున్నాయి. ఇక వేరే భాషా చిత్రాలు కూడా కోలీవుడ్ బాక్సాఫీస్ పై పెద్దగా ప్రభావం చూపించలేదు. 2024 కోలీవుడ్ డిజాస్టర్ కాగా ఈ ఇయర్ అయినా పరిశ్రమ ఎక్కువ సక్సెస్ లు అందుకుంటుందా లేదా అన్నది చూడాలి.