అరవ హీరోలందరికీ కావాలో హిట్!
కోలీవుడ్ కి ఇంతవరకూ ఒక్క పాన్ ఇండియా సక్సెస్ కూడా లేదు.
By: Tupaki Desk | 26 Dec 2024 3:30 PM GMTకోలీవుడ్ కి ఇంతవరకూ ఒక్క పాన్ ఇండియా సక్సెస్ కూడా లేదు. ఆ సక్సెస్ కోసం పోరాటం చేస్తున్నా ఫలించడం లేదు. లెజెండరీ డైరెక్టర్లు అంతా సీరియస్ గా ప్రయత్నాలు చేస్తున్నా? ఫలితాలు మాత్రం ఆశాజనకంగా రావడం లేదు. ఆ సంగతి పక్కనబెడితే? రీజనల్ గానూ కోలీవుడ్ హీరోల సినిమాలు భారీ విజయం సాధించడంలో విఫల మవుతున్నట్లే కనిపిస్తుంది. 'జైలర్' తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ కి సరైన సక్సెస్ లేదు.
ఆ తర్వాత నటించిన 'వెట్టేయాన్' అనుకున్నంతగా సక్సెస్ అవ్వలేదు. మంచి ప్రయత్నమైనా కమర్శియల్ గా వర్కౌట్ అవ్వలేదు. అలాగే గెస్ట్ రోల్ పోషించిన 'లాల్ సలామ్' ఏకంగా డిజాస్టర్ ఖాతాలో పడింది. ఇక ఉలగ నాయగాన్ కమల్ హాసన్ నటించిన 'ఇండియాన్ -2 'భారీ అంచనాల మధ్య రిలీజ్ అయి బోల్తా కొట్టింది. శంకర్ సినిమా కావడంతో ప్రచారం పీక్స్ కి చేరింది. కానీ రిలీజ్ తర్వాత బాక్సాఫీస్ వద్ద తుస్సు మంది. దళపతి విజయ్ పరిస్థితి కూడా అలాగే ఉంది.
ఆయన హీరోగా నటించిన 'గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' భారీ అంచనాల మధ్య రిలీజ్ అయి డిజాస్టర్ అయింది. తమిళనాడు రాజకీయాల్లకి ఎంటర్ అయిన తర్వాత ఇండస్ట్రీ నుంచి ఎదురైన తొలి వైఫల్యం ఇది. దీంతో పెద్దగా గ్యాప్ తీసుకోకుండానే తన 69వ చిత్రాన్ని పట్టాలెక్కించారు. అలాగే సూర్య నటించిన పిరియాడిక్ చిత్రం 'కంగువ' ఏకంగా పాన్ ఇండియాలో గొప్ప రిలీజ్ అయింది. కానీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా తేలింది.
ఈ సినిమా కోసం సూర్య మూడేళ్లు కేటాయించాడు. ఫలితం మాత్రం తీవ్ర నిరాశ పరిచింది. చియాన్ విక్రమ్ నటించిన 'తంగలాన్' కూడా అదే అంచనాలతో రిలీజ్ అయింది. కానీ సినిమా యావరేజ్ గా ఆడింది. సినిమాలో మంచి కంటెంట్ ఉన్నా? ఇంటెన్స్ ఫిల్మ్ కాలేకపోయింది. అలాగే తల అజిత్ నటించిన 'తనీవు' చివరి చిత్రం కూడా యావరేజ్ గానే ఆడింది. ఇంకా విశాల్ కి హిట్ అంతే అవసరం. మరి ఈ హీరోలంతా 2025లో కొత్త చిత్రాలతో బరిలోకి దిగుతున్నారు. ఎలాంటి విజయాలు అందుకుంటారో చూడాలి.