మెకానిక్ టూ స్టార్ హీరో..ఆయన జర్నీ ఎంతో ఇంట్రెస్టింగ్!
తల అజిత్ నేడు పెద్ద స్టార్ హీరో. కోట్ల రూపాయల మార్కెట్ ఉన్న నటుడు. అజిత్ సినిమాలంటే మార్కెట్ లో ఓ బ్రాండ్.
By: Tupaki Desk | 12 Feb 2025 9:30 PM GMTతల అజిత్ నేడు పెద్ద స్టార్ హీరో. కోట్ల రూపాయల మార్కెట్ ఉన్న నటుడు. అజిత్ సినిమాలంటే మార్కెట్ లో ఓ బ్రాండ్. కోట్లాది మంది అభిమానించే స్టార్. రజనీకాంత్, కమల్ హాసన్ జనరేషన్ హీరోల తర్వాత అంతటి స్టార్ గా ఎదిగింది అజిత్. విజయ్ , దనుష్, సూర్య, కార్తీ లాంటి హీరోలున్నా? అజిత్ మాత్రం వాళ్లందరికంటే స్పెషల్. మరి అలాంటి అజిత్ జర్నీ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఎంతో మందికి ఓ ఇనిస్పేరషన్ కూడా ఉంటుంది.
ఓసారి ఆ సంగతుల్లోకి వెళ్తే... అజిత్ కుటుంబం తమిళ కుటుంబమే అయినా పాకిస్తాన్ కి చెందిన మోహినీని అజిత్ తండ్రి వివాహం చేసుకుని కలకత్తాలో స్థిరపడ్డారు. వివాహం అనంతరం కలకత్తా నుంచి సికింద్రా బాద్కి వచ్చారు. అక్కడ తండ్రి ఫార్మా కంపెనీలోఉద్యోగం చేసేవారు. అజిత్ రెండవ సంతానం కాగా కొన్నాళ్లకు చెన్నై షిప్ట్ అయ్యారు. ఇలా రకరకాల ప్రాంతాలకు తిరగడంతో అజిత్ కి చదువు సరిగ్గా రాలేదు. లాస్ట్ ర్యాంకర్. చివరికి 10వ తరగతి పరీక్షలకు కూడా అజిత్ని అనుమతించలేదు. ఓసారి తండ్రితో కలిసి ఆపీస్కి వెళ్లిన సమయంలో రేసు బైక్ ఫోటోలు చూసి ఫిదా అయ్యాడు.
అప్పుడే అజిత్ కి రేసింగ్ పై ఆసక్తి మొదలైంది. అదే ఆసక్తితో రాయల్ ఎన్ పీల్డ్ కంపెనీలో మెకానికిక్ గా చేరాడు. కానీ అది అజిత్ తండ్రికి నచ్చలేదు. దీంతో అజిత్ని పని మాన్పించి గార్మెంట్స్ కంపెనీలో ఉద్యోగానికి పెట్టాడు పెద్దాయన. అయినా అజిత్ తన ఆసక్తితో రేసింగ్ ల్లో పాల్గొనేవాడు. ఆసమయంలో ఎస్ పీ బాల సబ్రమణ్యంతో పరిచయం అవ్వడం జరిగింది. ఆ స్నేహమే సినిమాల వరకూ తీసుకెళ్లింది. అప్పుడే గొల్లపూడి మారుతి రావు తనయుడు సినిమా మొదలు పెట్టాడు. ఆసినిమా నిర్మాతకు అజిత్ ని పరిచయం చేసింది ఎస్పీబీ.
అలా అజిత్ కెరీర్లో తొలి సినిమా `ప్రేమ పుస్తకం` అయింది. అలా మొదలైన ప్రయాణం స్టార్ గా మార్చింది. 350 కోట్ల అధిపతిని చేసింది. అభిమానం అన్నది అజిత్ దృష్టిలో సినిమా వరకే పరిమితం. అంతకు మించి అభిమానం పేరుతో అతి చేస్తే ఒప్పుకోరు. అభిమాన సంఘాల పేరుతో వృద్ధా ఖర్చు వద్దు అనుకుని ఏకంగా అభిమాన సంఘాల్నే రద్దు చేసారు. సినిమా నచ్చితే చూడండి లేకపోతే లేదు. కుటుంబానికి, తమ జీవితాలకు మాత్రమే విలువ ఇచ్చిముందుకెళ్లండని పిలుపునిచ్చిన మొట్ట మొదటి హీరో అజిత్.