Begin typing your search above and press return to search.

యమా స్టైలిష్ గా బాక్సాఫీస్ హీరో.. ఫిదా అవ్వాల్సిందే!

వైట్‌ అండ్ వైట్ సూట్‌ లో స్టైలిష్‌ గాగుల్స్‌ తో ఛిల్‌ అవుట్‌ మూడ్‌ లో ఉన్న అజిత్ పిక్.. ఓ రేంజ్ లో ఇప్పుడు రెస్పాన్స్ అందుకుంటోంది.

By:  Tupaki Desk   |   10 Oct 2024 10:15 AM GMT
యమా స్టైలిష్ గా బాక్సాఫీస్ హీరో..  ఫిదా అవ్వాల్సిందే!
X

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. బిగ్గెస్ట్ మాస్ హీరోల్లో ఒకరైన ఆయన.. ప్రస్తుతం పలు చిత్రాల్లో యాక్ట్ చేస్తున్నారు. అందులో ఒకటి గుడ్ బ్యాడ్ అగ్లీ. అజిత్ ఫ్యాన్ అధిక్‌ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాలో సీనియర్ బ్యూటీ త్రిష హీరోయన్ గా యాక్ట్ చేస్తున్నారు. సాలిడ్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రానున్న మూవీపై ఇప్పటికే అజిత్ ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన అజిత్ పోస్టర్ వేరే లెవెల్ లో రెస్పాన్స్ అందుకుంది. అందులో స్టైలిష్‌ గా ఛీర్‌ అప్‌ మూడ్‌ లో ఆయన కనిపించారు. బ్యాక్‌ డ్రాప్‌ లో గన్స్‌ రౌండప్ చేసిన ఆ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది. తాజాగా సినిమా సెట్స్ నుంచి దర్శకుడు అధిర్.. తన అభిమాన హీరో అజిత్ వర్కింగ్ స్టిల్ ను షేర్ చేశారు. స్పెయిన్ లోని మాడ్రిడ్ లో షూటింగ్ జరుగుతున్నట్లు వెల్లడించారు. డైరెక్టర్ షేర్ చేసిన వర్కింగ్ స్టిల్ లో హీరో అజిత్ అదిరిపోయారనే చెప్పాలి.

వైట్‌ అండ్ వైట్ సూట్‌ లో స్టైలిష్‌ గాగుల్స్‌ తో ఛిల్‌ అవుట్‌ మూడ్‌ లో ఉన్న అజిత్ పిక్.. ఓ రేంజ్ లో ఇప్పుడు రెస్పాన్స్ అందుకుంటోంది. సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. అజిత్ సూపర్ స్టైలిష్ గా ఉన్నారని నెటిజన్లు చెబుతున్నారు. స్టైలిష్ లుక్ లో అదరగొట్టేశారని అంటున్నారు. వెయిటింగ్ ఫర్ మూవీ అంటూ కామెంట్లు పెడుతున్నారు. అజిత్ ఖాతాలో గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాతో మరో హిట్ పడేలా కనిపిస్తుందని అంచనా వేస్తున్నారు.

ఇక సినిమా విషయానికొస్తే.. టాలీవుడ్ టాప్‌ ప్రొడక్షన్‌ బ్యానర్‌ మైత్రీ మూవీ మేకర్స్ గ్రాండ్ గా నిర్మిస్తోంది. తెలుగు యాక్టర్ సునీల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అండ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. వీరమ్ మూవీ తర్వాత అజిత్, డీఎస్పీ కాంబో మరోసారి రిపీట్ కానుంది. ఇప్పటి వరకు వచ్చిన పోస్టర్ అండ్ వర్కింగ్ స్టిల్ చూస్తుంటే.. సినిమాలో అజిత్ కుమార్‌ యాక్షన్‌ ప్యాక్డ్ రోల్‌ లో కనిపించినట్లు క్లియర్ గా తెలుస్తోంది.

అయితే డైరెక్టర్ మిజిల్ తిరుమేని దర్శకత్వంలో విదామూయార్చి సినిమా కూడా అజిత్ చేస్తున్నారు. లైకా సంస్థ నిర్మిస్తున్న ఆ మూవీ రీసెంట్ గా షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. త్వరలో రిలీజ్ కానుంది. ఆ సినిమా సెట్స్ పై ఉండగానే గుడ్ బ్యాడ్ అగ్లీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అజిత్. ఇప్పుడు షూటింగ్ షెడ్యూల్ లో పాల్గొంటున్నారు. వచ్చే ఏడాది గుడ్ బ్యాడ్ అగ్లీ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.