ఆ స్టార్లు ఇద్దరు రీజనల్ రేంజ్ కి పడిపోతున్నారా?
మేజర్ వసూళ్ల షేర్ కోలీవుడ్ తరహా ఆయా దేశాల నుంచి అధికంగా ఉండేది. కానీ కొంత కాలంగా అలాంటి సానుకూల ఫలితాలు రావడం లేదు.
By: Tupaki Desk | 2 Feb 2025 2:45 AM GMTకోలీవుడ్ లో ఓ ఇద్దరు స్టార్ హీరోలు రీజనల్ మార్కెట్ కే పరిమితం అవుతున్నారా? వరల్డ్ వైడ్ గా భారీ రిలీజ్ లు అయినా ఫలితాలు తారుమారవుతున్నాయా? అంటే సన్నివేశం అలాగే కనిపిస్తోంది. ఒకప్పుడు ఆ ఇద్దరు స్టార్ హీరోల చిత్రాలు పాన్ ఇండియా మార్కెట్ ని మించి విదేశాల్లో మంచి వసూళ్లు సాధించేవి. అయితే కొంత కాలంగా ఆ పరిస్థితి కనిపించలేదు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సినిమాలు ఓవర్సీస్ లో ఆశించిన ఫలితాలు రావడం లేదు.
చైనా, జపాన్, మలేషియా లాంటి దేశాల్లో ఆ ఇద్దరు హీరోలకు అప్పట్లో మంచి మార్కెట్ ఉండేది. భారీ ఎత్తున ఆయా దేశాల్లో రిలీజ్ లు జరిగేవి. మేజర్ వసూళ్ల షేర్ కోలీవుడ్ తరహా ఆయా దేశాల నుంచి అధికంగా ఉండేది. కానీ కొంత కాలంగా అలాంటి సానుకూల ఫలితాలు రావడం లేదు. వరుస వైఫల్యాలు సహా కంటెంట్ యూనివర్శల్ గా లేకపోవ డంతో అక్కడ ఆడియన్స్ పెదవి విరిచేస్తున్నారు. వాళ్లకంటే వెనకొచ్చిన తర్వాత తరం స్టార్లు ఇప్పుడు వాళ్ల స్థానాల్లో కనిపిస్తున్నారు.
మెరుగైన మార్కెట్ తో మంచి వసూళ్లు సాధిస్తున్నారు. ఇదే కొనసాగితే ఆ సూపర్ స్టార్లు ఇద్దరు భవిష్యత్ లో విదేశీ మార్కెట్ నుంచి మరింత ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందని ట్రేడ్ సైతం అంచనా వేస్తుంది. ఇండియా వైడ్ చూస్తే కోలీవుడ్ తప్ప ఇతర భాషల్లోనూ వాళ్ల సినిమాలు భారీ షేర్ తెస్తున్నట్లు కనిపించలేదు.ప్లాప్ టాక్ తెచ్చుకున్న చిత్రాలు సోంత భాషలో మోస్తారు వసూళ్లు సాధిస్తుంటే , ఇతర భాషల్లో వసూళ్లు ఏమాత్రం ఊహించని విధంగా కనిపిస్తున్నాయి.
గత నాలుగైదు సినిమాల గణాంకాలు చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్దమవుతుంది. దీంతో ఇప్పుడా ఇద్దరు హీరోలు అలెర్ట్ అవ్వాల్సిన సమయం వచ్చేసింది. భవిష్యత్ లో మరిన్ని మంచి సినిమాలు చేసి పుంజుకుంటే తప్ప మార్కెట్ లో ఆశించిన ఫలితాలు కనిపించవు.
పాన్ ఇండియా మార్కెట్ లో ఇప్పటికే టాలీవుడ్ హీరోల నుంచి తీవ్రమైన పోటీ ఉంది. వాళ్లను ఎదుర్కుని నిలబడటం అంటే కత్తి మీద సామే. వయసు కూడా మీద పడుతోన్న నేపథ్యంలో? ఇద్దరికీ అదో డ్రాబ్యాక్ గానూ కనిపిస్తుంది. మరి ఈ ఫేజ్ నుంచి ఎలా బయట పడతారో చూడాలి.