Begin typing your search above and press return to search.

కల్కిపై వాళ్ల కామెంట్.. ఊహించలేదుగా..?

ప్రభాస్ కల్కి సినిమా రిలీజ్ ఇంకా 3 రోజుల టైం ఉన్నా ఇప్పటికే సినిమా గురించి సోషల్ మీడియా అంతా హంగామా మొదలైంది.

By:  Tupaki Desk   |   24 Jun 2024 10:13 AM GMT
కల్కిపై వాళ్ల కామెంట్.. ఊహించలేదుగా..?
X

ప్రభాస్ కల్కి సినిమా రిలీజ్ ఇంకా 3 రోజుల టైం ఉన్నా ఇప్పటికే సినిమా గురించి సోషల్ మీడియా అంతా హంగామా మొదలైంది. సినిమాకు బుకింగ్స్ ఇలా ఓపెన్ అవ్వడమే ఆలస్యం అలా హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. కల్కి సినిమా కోసం నాగ్ అశ్విన్ పడిన 3 ఏళ్ల కష్టానికి రిలీజ్ ముందే ఇలాంటి పాజిటివ్ బజ్ రావడం అందరినీ సంతోషపరుస్తుంది. ఇక ఈ సినిమా రిలీజ్ ట్రైలర్ పై ప్రత్యేకంగా కోలీవుడ్ సెలబ్రిటీస్ మాట్లాడటం అందరిని సర్ ప్రైజ్ చేస్తుంది.

కల్కి రిలీజ్ ట్రైలర్ చూశాక అక్కడ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్, శింబు ఇలా ప్రతి ఒక్క సెలబ్రిటీ ఎక్స్ వేదికగా తమ స్పందన తెలియచేశారు. సినిమాతో నాగ్ అశ్విన్ ఒక అద్భుతాన్ని సృష్టించబోతున్నారని సినిమాకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. తెలుగు సినిమా పాన్ వరల్డ్ వైడ్ చేస్తున్న సంచలనానికి పక్కనే ఉన్న తమిళ పెద్దలు కాస్త అప్సెట్ అవుతున్నారన్న వాదనలు వినిపించాయి.

కానీ ఒక మంచి సినిమా వస్తే దాన్ని మనస్పూర్తిగా అభినందించాల్సిందే అంటూ కోలీవుడ్ నుంచి కొందరు దర్శకులు కల్కి కోసం స్పెషల్ గా సోషల్ మీడియా వేదికగా ప్రస్తావించడం తెలుగు ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుంది. తెలుగు ప్రేక్షకులు ఎలాంటి సినిమానైనా ఆదరిస్తారు. భాషతో సంబంధం లేకుండా అసలు సినిమాలో నటీనటులు, దర్శకుడు ఎవరో తెలియకుండా కూడా సినిమాను ఆదరిస్తారు. సినిమాలో కమల్ హాసన్ నటించాడు కాబట్టి తమిళ సెలబ్రిటీస్ కల్కి ప్రస్తావన తెచ్చారంటే నమ్మలేం. ఒక మంచి సినిమా అది కూడా సౌత్ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ ని శాసించేలా వస్తుంటే కచ్చితంగా అందరు దానికి స్వాగతం చెప్పక తప్పదు.

అలాంటి తెలుగు సినిమా నుంచి వస్తున్న సినిమాల గురించి కొందరు కావాలని నెగిటివ్ స్ప్రెడ్ చేస్తుంటారు. కానీ కల్కి విషయంలో తమిళ దర్శకులు, హీరోలు చేస్తున్న ఈ పాజిటివ్ ప్రమోషన్ సినిమాకు బాగా హెల్ప్ అవుతుందని చెప్పొచ్చు. ప్రభాస్ కల్కి బాక్సాఫీస్ పై విధ్వంసం సృష్టించడానికి రెడీ అవుతున్నాడు. టికెట్స్ బుకింగ్స్ తో వస్తున్న వైబ్ చూస్తుంటే సినిమా మొదటి రోజే సంచలన రికార్డులు సృష్టించేలా ఉందని అనిపిస్తుంది. కల్కి సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ లో కూడా అమితాబ్, కమల్, ప్రభాస్ సినిమాపై అంచనాలను ఇంకాస్త పెంచడంతో సినిమా చూడాలన్న ఎగ్జైట్మెంట్ ఆడియన్స్ లో మరింత పెరుగుతుంది.