మనమెందుకు తగ్గాలి అంటున్నారా?
తెలుగు సినిమా కోలీవుడ్ లో రిలీజ్ అవుతుందంటే? థియేటర్లు దొరకడం అంత వీజీ కాదన్నది తెలిసిందే.
By: Tupaki Desk | 11 Nov 2023 12:30 AM GMTతెలుగు సినిమా కోలీవుడ్ లో రిలీజ్ అవుతుందంటే? థియేటర్లు దొరకడం అంత వీజీ కాదన్నది తెలిసిందే. సరైన పంపిణీ సంస్థ లేకపోతే థియేటర్లు చాలా తక్కువగా దొరుకుతాయి. పైగా తెలుగు సినిమాలకు అక్కడ మార్కెట్ కూడా పెద్దగా ఉండని నేపథ్యంలో రిలీజ్ కి చాలా మంది అనాసక్తి చూపిస్తుంటారు. అందుకే తమిళ మార్కెట్ నుంచి తెలుగు సినిమా వసూళ్లు చాలా తక్కువగా కనిపిస్తుంటాయి.
దేశంలో అన్నిచోట్ల తెలుగు సినిమా భారీ వసూళ్లుసాధించిందని రికార్డులు కూడా కనిపిస్తాయి..కానీ తెలుగు సినిమా తమిళ్ లో భారీ వసూళ్లు తెచ్చిన దాఖలాలు మాత్రం పెద్దగా కనిపించవు. తెలుగు సినిమా అంటే అక్కడో రకమైన చిన్న చూపు భావన ఉంది అన్న విమర్శలు కూడా ఉన్నాయి. మొత్తంగా ఇవన్నీ తెలుగు సినిమాపై ప్రభావాన్ని చాలా కాలంగా చూపిస్తున్నాయి. అదే తమిళ సినిమా తెలుగులో రిలీజ్ అవుతుందంటే? పోటీ పడి మరీ రిలీజ్ చేస్తుంటారు. వాటికి ఇక్కడ థియేటర్లు కూడా అలాగే దొరుకుతాయి.
ఈ మధ్య కాలంలో పండగ సీజన్లని సైతం తమిళ సినిమాలు టార్గెట్ చేస్తున్నాయంటే? పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. 2024 సంక్రాంతికి తెలుగు సినిమాలకు పోటీగా కొంత మంది తమిళ హీరోల చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. రిలీజ్ తేదీలు అటు ఇటు గా ఉన్నాయి తప్ప! టాలీవుడ్ హీరోలకు పోటీగానే ఆ చిత్రాలు దిగుతున్నాయి. అవి ఇక్కడ మంచి పంపిణీ సంస్థల నుంచి రిలీజ్ అవుతున్నాయి.
అయితే ఇప్పుడీ విషయం కొంత మంది నిర్మాతల్లో చర్చకు దారి తీసినట్లు సమాచారం. డబ్బింగ్ సినిమాలకు థియేటర్లు అధికంగా కేటాయించడం? దేనికి అన్న చర్చ తెరపైకి వస్తోంది. కోలీవుడ్ లో మన సినిమాలకు ఆదరణ తక్కువైనప్పుడు వాళ్ల చిత్రాల్ని మనమెందుకు? ప్రోత్సహించాలి అని ఓ నలుగైరు దుగురు నిర్మాతలు మాట్లాడుకుంటున్నారుట. ఈ విషయాన్ని పెద్దల దృష్టికి తీసుకెళ్లి పరిమితంగానే వాటికి థియేటర్లు కేటాయించేలా ఆనలుగురితో చర్చిస్తే ఫలితం ఉంటుందని ఆలోచన చేస్తున్నారుట. ఆ హీరోల చిత్రాలు మార్కెట్ అవ్వక ముందే ఓ నిర్ణయానికి వస్తే అది ఎవరికీ ఇబ్బంది ఉండదని...తీరా కొన్న తర్వాత అడ్డు తగలడం కన్నా ముందే అడ్డు పుల్ల వేస్తే ఉత్తమం అని ఆలోచన చేస్తున్నారుట. మరి ఇది ఎంతవరకూ ఆచరణలోకి వస్తుంది అన్నది చూడాలి.