కోలీవుడ్ పొంగల్ ఫైట్.. ఆ ఇద్దరి మద్యే అసలైన రచ్చ
గత ఏడాది 'మావీరన్' తో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ కోలీవుడ్ హీరో ఈసారి సైఫై మూవీ తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు.
By: Tupaki Desk | 11 Jan 2024 5:42 AM GMTసంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గరే కాదు కోలీవుడ్ లోనూ గట్టి పోటీ నెలకొంది. తెలుగులో చూసుకుంటే నాలుగు సినిమాలు పోటీకి దిగితే తమిళంలో రెండు సినిమాల మధ్య బాక్సాఫీస్ ఫైట్ జరగనుంది. ఈసారి సంక్రాంతికి ధనుష్ 'కెప్టెన్ మిల్లర్' శివ కార్తికేయన్ 'అయలాన్' సినిమాలు విడుదలవుతున్నాయి. ఈ రెండు సినిమాలు అరవ ఆడియన్స్ కి సరికొత్త సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి.
ఈ రెండు సినిమాలు డిఫరెంట్ జోనర్ లో రూపొందినవే. ఇందులో ధనుష్ 'కెప్టెన్ మిల్లర్' పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా వస్తుంటే శివ కార్తికేయన్ 'అయలాన్' సైన్స్ ఫిక్షన్ మూవీగా రాబోతోంది. ఈ రెండు సినిమాల్లోనూ రెండు బలమైన మెసేజ్లు ఉన్నాయి. ఇప్పటికే ఈ రెండు సినిమాల ట్రైలర్స్ కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. శివ కార్తికేయన్ గత కొంతకాలంగా కోలీవుడ్లో డిఫరెంట్ జోనర్ సినిమాలు చేస్తూ ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నాడు.
గత ఏడాది 'మావీరన్' తో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ కోలీవుడ్ హీరో ఈసారి సైఫై మూవీ తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. అతను నటించిన 'డాక్టర్' నుంచి మొన్న వచ్చిన 'మావీరన్' వరకు అన్ని సరికొత్త సబ్జెక్టుతో తెరకెక్కినవే. ఈ సినిమాలతో కోలీవుడ్ లోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రేక్షకులను అలరించి ఇక్కడ కూడా మంచి మార్కెట్ ఏర్పరచుకున్నాడు.
ఇక ధనుష్ విషయానికి వస్తే.. కొన్నాళ్లుగా స్క్రిప్ట్ సెలక్షన్లో తడబడుతున్నాడు. ఈమధ్య తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీ 'సార్' తప్పితే అంతకుముందు నటించిన జగమే తంతిరమ్, మారన్ వంటి సినిమాలు ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాయి. ఈ సినిమాలు కాస్త ధనుష్ క్రెడిబిలిటీని తగ్గించాయి. ధనుష్ ఎంత టాలెంటెడ్ యాక్టరో తెలిసిందే. యాక్టింగ్ స్కోప్ ఉన్న సినిమా పడితే ఎలా ఉంటుందో ఇప్పటికే కర్ణన్, అసురన్ వంటి సినిమాలు ద్వారా చూసాం.
ఇక కెప్టెన్ మిల్లర్ ప్రమోషనల్ కంటెంట్ చూస్తే ఈసారి ధనుష్ తన యాక్టింగ్ తో మ్యాజిక్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కోలీవుడ్ లో ఈసారి ధనుష్, శివ కార్తికేయన్ లాంటి టైర్-2 హీరోస్ మధ్య గట్టి పోటీ జరగబోతోంది. మరి కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఈ రెండు సినిమాలు ఎలాంటి రిజల్ట్ ని అందుకుంటాయో చూడాలి.