Begin typing your search above and press return to search.

పెళ్లికి బిర్యానీకి లింక్ పెట్టిన ముద్దుగుమ్మ

నేను సీతాదేవి, హిట్ 2 సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన తెలుగు ముద్దుగుమ్మ ప్రసాద్ కోమలి.

By:  Tupaki Desk   |   22 March 2024 5:18 AM GMT
పెళ్లికి బిర్యానీకి లింక్ పెట్టిన ముద్దుగుమ్మ
X

నేను సీతాదేవి, హిట్ 2 సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన తెలుగు ముద్దుగుమ్మ ప్రసాద్ కోమలి. ఈ అమ్మడు తెలుగు అమ్మాయి అయినా కూడా వరుసగా ఆఫర్లు దక్కించుకుంటూ ఉంది. చూడ్డానికి ఉత్తరాది ముద్దుగుమ్మ అన్నట్లుగా ఉండే ఈ అమ్మడు తన అందంతో ఆకట్టుకుంటూ ఉంది.

ప్రస్తుతం వరుస సినిమాలతో సందడి చేసేందుకు రెడీ అవుతున్న ప్రసాద్‌ కోమలి తాజాగా ఒక చిట్ చాట్ లో తన అభిరుచులు, ఇష్టాల గురించి మాట్లాడింది. తన వ్యక్తిగత విషయాలను కూడా మీడియా తో పంచుకుంటూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

ప్రసాద్‌ కోమలి మాట్లాడుతూ... తనకు బిర్యానీ అంటే చాలా ఇష్టం. ప్రతి రోజు ఒక పూట బిర్యానీ తినిపించే వాడినే పెళ్లి చేసుకుంటాను. అలాగే నాకు అతడు ప్రతి రోజు జోక్స్ చెబుతూ నవ్విస్తూ ఉండాలని కూడా కండీషన్ పెట్టింది.

గతంలో ఒక వ్యక్తిని ప్రేమించాను అంటూ చెప్పుకొచ్చిన కోమలి ప్రస్తుతం ఆ వ్యక్తికి దూరంగా ఉంటున్నట్లు పేర్కొంది. తాము ఇద్దరం కొన్ని కారణాల వల్ల బ్రేకప్ అయినట్లు తెలియజేసింది. నటిగా ప్రస్తుతం తాను మంచి ఆఫర్లు పొందుతున్నట్లు తెలియజేసింది.

తెలుగు అమ్మాయిలకు ఆఫర్లు రావు అంటారు. కానీ నేను తెలుగు అమ్మాయిని అవ్వడం వల్లే కొన్ని ఆఫర్లు వచ్చాయి అంది. చాలా మంది నన్ను ముంబై నుంచి వచ్చినట్లు ఉన్నావు అంటారని, నేను తెలుగు అమ్మాయినే అంటూ మరోసారి పేర్కొంది.