Begin typing your search above and press return to search.

అన్నీ మగవారి కోసమేనా.. ఆడవాళ్ల కోసం తీయరా?

ఆ తర్వాత అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి, నెపోలియన్, సెబాస్టియన్‌ పిసి524, రౌడీ బాయ్స్ మూవీల్లో నటించింది.

By:  Tupaki Desk   |   22 March 2024 3:00 AM GMT
అన్నీ మగవారి కోసమేనా.. ఆడవాళ్ల కోసం తీయరా?
X

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంత మంది తెలుగమ్మాయిలు ఉన్నారంటే.. వేళ్ల మీద లెక్కేసి చెప్పవచ్చు. కొద్దిమంది తెలుగమ్మాయిలు మాత్రమే హీరోయిన్లుగా రాణిస్తున్నారు. అలాంటి వారిలో ఒక బ్యూటీ కోమలి ప్రసాద్. 8 ఏళ్ల క్రితం.. నేను సీతాదేవి మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిందీ చిన్నది. ఆ తర్వాత అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి, నెపోలియన్, సెబాస్టియన్‌ పిసి524, రౌడీ బాయ్స్ మూవీల్లో నటించింది.

కానీ అనుకున్న స్థాయిలో గుర్తింపు సంపాదించుకోలేక పోయింది. హిట్ మూవీతో మాత్రం మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత ఇండస్ట్రీలో వరుస అవకాశాలు దక్కించుకుంటోంది. ప్రస్తుతం ఆమె శశివదనే మూవీలో నటిస్తోంది. పలాస 1978 ఫేమ్ హీరో రక్షిత్ సరసన హీరోయిన్ గా యాక్ట్ చేస్తోంది. ఏప్రిల్ 19వ తేదీన ఈ మూవీ థియేటర్లలోకి రానుంది. తాజాగా చిత్ర యూనిట్ నిర్వహించిన ప్రెస్ మీట్ లో కోమలి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తెలుగమ్మాయిలకు ఛాన్స్ ఇవ్వడం లేదని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చింది కోమలి. తెలుగు మేకర్స్ మంచి టాలెంట్ ఉన్న అమ్మాయిల కోసం వెతుకుతున్నట్లు చెప్పింది. తాను తమిళ సినిమా కోసం 20 రోజుల పాటు వర్క్ షాప్ చేశానని గుర్తుచేసుకుంది. యాక్టింగ్‌ ట్రైనర్‌ చెప్పినట్లుగా యాక్ట్ చేశానని, 20 రోజుల్లో తమిళ్ నేర్చుకున్నట్లు తెలిపింది.

అయితే ప్రతి లవ్ స్టోరీలో అమ్మాయినే దోషిగా చూపిస్తారెందుకు పాపం కదా సర్ అని నవ్వుతూ అంది కోమలి ప్రసాద్. "నాకు తెలిసిన సర్కిల్ లో ఐదుగురు అబ్బాయిలు అమ్మాయిలను మోసం చేశారు. దీనిపై మాత్రం ఎవరూ సినిమాలు తీయరు. అందుకే ఇండస్ట్రీలోకి ఫిమేల్ డైరెక్టర్స్ రావాలి. మోసం చేయడం చేయకపోవడం జెండర్ తో సంబంధం లేదు. మనిషి చెడ్డ వాళ్ల.. మంచి వాళ్ల.. అనేది చూడాలి" అని తెలిపింది.

"నేను ఏ మతాన్ని నమ్మను. ప్రేమను బాగా నమ్ముతాను. నేను నమ్మే మతం ప్రేమ. దేవుడి గుడికి ఎక్కువగా వెళ్లను. అది ఎవరైనా సరే.. నేను నా లైఫ్ లో నిజంగా ప్రేమిస్తే.. నాకోసం ఏదైనా చేయాలి.. తను అంత కష్టంలో ఉన్నా నేనూ హెల్ప్ చేయాలి.. అలాంటి వారినే ప్రేమిస్తా. నేను వన్ మ్యాన్ ఉమెన్" అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది కోమలి. శశివదనేలో చేసిన రోల్ తన ఒరిజినల్ క్యారెక్టర్ కు బాగా షూట్ అవుతుందని చెప్పింది. సినిమాలో శశి చెప్పిందంటే చేస్తాదంటే అంటూ ముగించింది.