Begin typing your search above and press return to search.

వ‌ర్మ‌పై కోన వెంక‌ట్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

ఈ సినిమా ప్ర‌చారంలో భాగంగా కోన వెంక‌ట్ ఓ ఇంట‌ర్వ్యూలో సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసారు.

By:  Tupaki Desk   |   5 March 2024 3:00 AM GMT
వ‌ర్మ‌పై కోన వెంక‌ట్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!
X

రైట‌ర్ గా..నిర్మాత‌గా కోన వెంక‌ట్ టాలీవుడ్ జ‌ర్నీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ర‌చ‌యిత‌గా ఎన్నో సినిమా ల‌కు ప‌నిచేసి త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపును ద‌క్కించుకున్నారు. అటుపై నిర్మాత‌గానూ స‌త్తా చాటే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ప్ర‌స్తుతం `గీతాంజ‌లి`కి సీక్వెల్ గా `గీతాంజ‌లి మ‌ళ్లీ వ‌చ్చింది` అంటూ మ‌రో సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తానే స్టోరీ...స్క్రీన్ ప్లే...నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అంజ‌లి లీడ్ రోల్ చేస్తుంది. ఈ సినిమా ప్ర‌చారంలో భాగంగా కోన వెంక‌ట్ ఓ ఇంట‌ర్వ్యూలో సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసారు.

వ‌ర్మ‌ను బాగా ద‌గ్గ‌ర నుంచి చూసిన అనుభ‌వం...ఆయ‌న‌తో ఉన్న సాన్నిహిత్యంతో కోన ఈ వ్యాఖ్య‌లు చేసిన‌ట్లు తెలుస్తోంది. ఆవేంటో ఆయ‌న మాటల్లోనే... `కొన్నేళ్ల పాటు సంసారం చేసిన తరువాత జీవితం పట్ల వైరాగ్యంతో సన్యాసం తీసుకునేవాళ్లు కొంతమంది ఉంటారు. వర్మ ఒక దర్శకుడిగా తానేమిటనేది ఈ ప్రపంచానికి చూపించాడు. డబ్బు .. కీర్తి ప్రతిష్ఠలు అన్నీ చూసేశాడు. ఇప్పుడు ఆయున చేసిన సినిమాలు చూస్తుంటే సినిమాలు పట్ల ఆయన వైరాగ్యంతో ఉన్నాడేమోనని అనిపిస్తోంది.

వర్మ తాను చేస్తున్నది తప్పని ఎప్పుడూ అనుకోడు. ఎవరైనా చెప్పినా వినిపించుకోడు. అసలు చెప్పింది వినిపించుకోనివాడిపేరే వర్మ. పదిమందికి నచ్చే సినిమా కాదు .. నాకు నచ్చిన సినిమా తీస్తాను .. నచ్చితే చూడండి .. లేకపోతే లేదు అనే ఒక ఫిలాసఫీలోకి ఆయన వెళ్లిపోయాడు. తనకి నచ్చినట్టుగా బ్రతక‌డం తెలిసిన ఏకైక జీవినే ఆర్జీవీ` అని అన్నారు. వ‌ర్మ గురించి ఆయ‌న శిష్యులు ఎవ‌రైనా ఇలాగే స్పంది స్తుంటారు.

ఆయ‌న ద‌గ్గ‌ర ప‌నిచేయ‌డంతో ఆయ‌న ఎలా ఉంటాడు? ఆయ‌న వ్య‌క్తిత్వం ఎలాంటింది? వంటి విష‌యాల‌పై విశ్లేషిస్తుంటారు. ఇండ‌స్ట్రీ నుంచి వ‌ర్మ శిష్యులు ఎంతో మంది ఉన్నారు. చాలా మంది ఆయ‌న వ‌ద్ద శిష్య‌రికం చేసి స్టార్ డైరెక్ట‌ర్లు అయిన వారే. కృష్ణ‌వంశీ...పూరి జ‌గ‌న్నాధ్..హ‌రీష్ శంక‌ర్ ఇలా చాలా పెద్ద జాబితానే ఉంది. అయితే శిష్యులంద‌రిలోకి వ‌ర్మ‌కి పూరి అంటే ఇష్టం. ఆయ‌న ప్రియ శిష్యుడు లాంటి వారు.