కొండమల్లి అవతారం దడ పుట్టిస్తోంది
దీనికి తోడు ఎక్స్ ప్రెషన్స్ లోను చాలా వైవిధ్యం చూపించాలి. జమానా కాలంలో కేజీఎఫ్ గనుల స్థలంలోని గిరిజన సంస్కృతిని అద్దంపడుతూ పా రంజిత్ భారీ ప్రయోగం చేస్తున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 2 Nov 2023 6:00 AM GMTలుక్ పరంగా ప్రయోగాలు చేసేందుకు కొందరు వెనకాడరు. ఎప్పుడూ రెగ్యులర్ గ్లామర్ ఎలివేషన్ నటీమణులకు పేరు తెచ్చి పెట్టదు. అప్పుడప్పుడూ అయినా ప్రయోగాలు చేస్తేనే ఫలితం విభిన్నంగా ఉంటుంది. అయితే దీనికోసం చాలా చెమటోడ్చాల్సొస్తుంది. డీగ్లామరస్ లుక్ లో కనిపించడం అంటే ఆషామాషీ కాదు. రూపం ఆహార్యం కాస్ట్యూమ్స్ ఇలా అన్నిటిలో మార్పులు తేవాలి. దీనికి తోడు ఎక్స్ ప్రెషన్స్ లోను చాలా వైవిధ్యం చూపించాలి. జమానా కాలంలో కేజీఎఫ్ గనుల స్థలంలోని గిరిజన సంస్కృతిని అద్దంపడుతూ పా రంజిత్ భారీ ప్రయోగం చేస్తున్న సంగతి తెలిసిందే.
తంగలాన్ అనేది టైటిల్. ఈ సినిమా టీజర్ ఇప్పటికే విడుదలై ఆకట్టుకుంది. ముఖ్యంగా చియాన్ విక్రమ్ గెటప్, అతడితో పాటు ఉండే ఇతర పాత్రల వేషధారణలు షాక్ కి గురి చేసాయి. నాటి రోజుల్లో కర్కోఠకులైన గిరిజన ఆటవిక సంస్కృతిని తెరపై ఎంతో రియలిస్టిక్ గా చూపిస్తున్నాడు పా రంజిత్. ఇక ఇందులో మాళవిక మోహనన్ కూడా డీగ్లామరస్ పాత్రలో కనిపించింది.
గ్లామర్ వేషాలతో నిరంతరం సోషల్ మీడియాల్లో ఫ్యాన్స్ ని షేక్ చేస్తున్న మాళవిక ఉన్నట్టుండి ఇలా గెటప్ ఛేంజ్ చేసేసరికి ఎవరూ గుర్తు పట్టలేకపోతున్నారు. అభిమానులు అయితే షాక్ లో ఉండిపోతున్నారు. మాళవిక ఫస్ట్ లుక్ కొన్ని వారాల క్రితం విడుదలైంది. దీనికి మిశ్రమ స్పందనలు వచ్చాయి కానీ తాజా టీజర్‌లో, మాళవిక అవతార్ చూడటానికి భయపెడుతోంది. అయితే మాళవిక ఈ రగ్గ్ డ్ మాస్ పాత్రలో ఇమిడిపోయేందుకు ఎంతగా శ్రమించిందో ఈ ఒక్క పోస్టర్ చూస్తేనే అర్థమవుతోంది. కేవలం డీగ్లామర్ మాత్రమే కాదు.. హింసాత్మక పాత్రతో మాళవిక సర్ ప్రైజ్ చేయనుందని టీజర్ తో అర్థమైంది.
చియాన్ విక్రమ్ లుక్ కి ధీటుగా, ఇప్పుడు మాళవిక లుక్ కూడా అభిమానులను షాక్‌కి గురి చేసింది. తంగళన్ టీజర్‌తో పాటు మాళవిక మోహనన్ లుక్ వైరల్‌గా మారింది. మాళవిక లుక్‌పై ఇప్పటికే చాలా మీమ్స్ వచ్చాయి. తంగలాన్ అనేది భారతదేశంలోని బ్రిటిష్ వలసరాజ్యాల కాలంలోని చారిత్రాత్మకమైన కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో సాగే పీరియాడికల్ మూవీ. ఈ సినిమా ఆద్యంతం గిరిజన గోండు పాత్రలు దర్శనమిస్తాయి. ముఖ్యంగా విక్రమ్, మాళవిక ఇంటెన్స్ లుక్స్ కి విస్మయం చెందాల్సిందే