Begin typing your search above and press return to search.

'దేవర'.. మరో రైటర్ వర్క్ చేశాడా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శకుడు కొరటాల శివ కలయిలో వచ్చిన రెండవ సినిమా ‘దేవర’ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబడుతోంది.

By:  Tupaki Desk   |   2 Oct 2024 9:30 AM GMT
దేవర.. మరో రైటర్ వర్క్ చేశాడా?
X

యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శకుడు కొరటాల శివ కలయిలో వచ్చిన రెండవ సినిమా ‘దేవర’ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబడుతోంది. ఇక ఈ సినిమా, ఎన్టీఆర్ అభిమానులకు మాస్ ఎంటర్టైనర్‌గా మారింది. రాజమౌళితో చేసిన సినిమాల తర్వాత హీరోలు ఫ్లాప్ అవుతారనే సెంటిమెంట్‌ను బ్రేక్ చేసిన సినిమా ‘దేవర’. ముఖ్యంగా అనిరుధ్ వర్క్ కూడా సినిమా విజయంలో కీలక పాత్ర పోషించిందని చెప్పవచ్చు.

ఇక కొరటాల శివ రచనపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు కలిగి ఉన్నారు. ఆయన రాసిన డైలాగులు, కథలోని మెచ్యూరిటీ ఈ సినిమాను నిలబెట్టాయి. అయితే, ‘దేవర’ వెనుక మరో రచయిత హస్తం కూడా ఉందని తాజాగా మరో కొత్త టాక్ వినిపిస్తోంది. అతను మరెవరో కాదు.. శ్రీకాంత్ విస్సా అనే రచయిత. ఈ సినిమాకు కీలకమైన సన్నివేశాలను రాయడంలో అతను సహకరించారట.

శ్రీకాంత్ పుష్ప సినిమాకి రైటర్ గా వర్క్ చేశారు. అనంతరం ఒక్కసారిగా అతనికి క్రేజ్ పెరిగింది. ఇక వెంకీ మామ, ఖిలాడి, రావణాసుర సినిమాలకు కూడా వర్క్ చేశారు. ఇక క‌ల్యాణ్ రామ్‌ 'డెవిల్' చిత్రానికి కూడా రైటర్‌గా పని చేశారు. అప్పుడే అతని టాలెంట్ ను గుర్తించిన కళ్యాణ్ రామ్ (నిర్మాత) దేవర స్క్రిప్ట్ విషయంలో కూడా కూడా శ్రీకాంత్ సహకారం కోరాడట.

శ్రీకాంత్ దేవరకు సంబంధించిన కొన్ని సన్నివేశాల కోసం రాత సాయం అందించారని సమాచారం. రచయితగా కొరటాల శివకు ఎంతో అనుభవం ఉన్నప్పటికీ, మరో రచయిత ఐడియాలను స్వీకరించడంలో ఆయన ఎలాంటి అభ్యంతరం చూపకపోవడం ఆయన సంస్కారాన్ని చూపిస్తుంది. ఇక ‘దేవర 1’ విజయవంతం అయిన తర్వాత, ఇప్పుడు అందరూ ‘దేవర 2’ కోసం ఎదురు చూస్తున్నారు.

కానీ అంతకంటే ముందు ఎన్టీఆర్ ఇతర ప్రాజెక్టులను పూర్తి చేయాల్సి ఉంది. కొరటాల శివ కూడా మరో ప్రాజెక్టును పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ‘దేవర 2’ వచ్చే వరకు కొరటాల, ఎన్టీఆర్ మధ్యలో తమ పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసుకోవాలని భావిస్తున్నారు. కొరటాల శివ తన కెరీర్ ప్రారంభం నుండి స్టార్ హీరోలతో మాత్రమే పని చేశారు. ‘దేవర’ విజయంతో కొరటాల తన మార్క్ రైటింగ్ మరియు డైరెక్షన్‌తో మరో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. ఇప్పుడు ఆయన ఎవరితో తన తదుపరి ప్రాజెక్ట్ చేస్తారన్న దానిపై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.