Begin typing your search above and press return to search.

కొరటాల శివ మహేష్ బాండింగ్.. ఎంత బలంగా ఉందంటే

రైటర్ కమ్ డైరెక్టర్ కొరటాల శివ మొదటి సినిమా ‘మిర్చి’తో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడు.

By:  Tupaki Desk   |   15 Sep 2024 5:57 AM GMT
కొరటాల శివ మహేష్ బాండింగ్.. ఎంత బలంగా ఉందంటే
X

రైటర్ కమ్ డైరెక్టర్ కొరటాల శివ మొదటి సినిమా ‘మిర్చి’తో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడు. వెంటనే రెండో సినిమాని ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేసే ఛాన్స్ ని కొరటాల సొంతం చేసుకున్నాడు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘శ్రీమంతుడు’ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. తరువాత కొరటాల ఎన్టీఆర్ తో ‘జనతా గ్యారేజ్’ మూవీ చేసి మరో బ్లాక్ బస్టర్ కొట్టారు. దీని తర్వాత మరల సూపర్ స్టార్ మహేష్ బాబుతోనే ‘భరత్ అనే నేను’ సినిమా చేసి బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు.

మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన రెండు సినిమాలు క్లాస్ టచ్ లో సాగే మాస్ కమర్షియల్ మూవీస్. ఈ సినిమాలతో మహేష్ కెరియర్ లో హైయెస్ట్ కలెక్షన్స్ అందుకున్నాడు. ఈ మూవీస్ అతని ఇమేజ్ ని, మార్కెట్ వేల్యూని అమాంతం పెంచేసాయి. ‘భరత్ అనే నేను’ చిత్రం తర్వాత కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవితో ‘ఆచార్య’ మూవీ చేసి డిజాస్టర్ అందుకున్నారు. ఈ సినిమా కారణంగా కొరటాల శివ ఇమేజ్ కూడా కొంత వరకు దెబ్బతిన్నది.

‘ఆచార్య’ ఎఫెక్ట్ తో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొరటాల శివతో కమిట్ అయిన మూవీని పక్కన పెట్టారు. అయితే ఎన్టీఆర్ కొరటాల శివ మీద నమ్మకం ఉంచారు. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఏడాది కాలం వెయిట్ చేసి కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లారు. ఈ మూవీ సెప్టెంబర్ 27న రిలీజ్ అవుతోంది. ఇదిలా ఉంటే ‘దేవర’ తర్వాత కొరటాల శివ మరల మహేష్ బాబుతోనే సినిమా చేసే అవకాశం ఉందనే ప్రచారం కొంతకాలంగా నడుస్తోంది.

‘ఆచార్య’ మూవీ ప్రమోషన్స్ సమయంలో మహేష్ బాబు గురించి కొరటాల గొప్పగా చెప్పారు. మహేష్ బాబుకి నేనంటే చాలా ఇష్టం అని ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. నేను ఏ అప్షన్ లేదు అనుకున్న టైంలో కూడా మహేష్ బాబు నాకు అండగా నిలబడటానికి సిద్ధంగా ఉంటారు. నేనంటే మహేష్ బాబుకి అంత ఇష్టం అని ఇంటర్వ్యూలో కొరటాల తెలిపారు. ఆ వీడియోని సూపర్ స్టార్ అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

ఈ ఒక్క మాట కోసం అయిన ‘దేవర’ని బ్లాక్ బస్టర్ చేయాలి అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ‘దేవర’ మూవీ ఫలితం ఎలా ఉన్నా కూడా మహేష్ బాబు తనకి మళ్ళీ అవకాశం ఇస్తారనే నమ్మకంతో కొరటాల ఉన్నారనే మాట వినిపిస్తోంది. ‘ఆచార్య’ సినిమాకి కూడా అడగగానే మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చారు. అందుకే మహేష్ బాబు మీద కొరటాల శివ చాలా నమ్మకంగా ఉన్నారు. ‘దేవర’ సినిమాపైనే ఒక వర్గం నుంచి నెగిటివ్ టాక్ ఎక్కువగా వస్తోంది. ‘ఆచార్య’ సినిమాతో కంపారిజన్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. ‘దేవర’ మూవీ హిట్ అయితే ఈ ట్రోల్స్ కి అడ్డుకట్ట పడుతుంది. లేదంటే మరింత పెరిగే ఛాన్స్ ఉంది. ఒకవేళ ‘దేవర’ మూవీ ఆశించిన స్థాయిలో మెప్పించకపోతే కొరటాల పరిస్థితి ఏంటి అనే ప్రశ్న సోషల్ మీడియాలో వినిపిస్తోంది.