Begin typing your search above and press return to search.

తిరుమలేశుడి సన్నిధిలో దేవర దర్శకుడు..!

సినిమా రిలీజ్ లు ముందు పుణ్యక్షేత్రాలు తిరిగి దేవుడి ఆశీస్సులు తీసుకోవడం చాలా కామన్.

By:  Tupaki Desk   |   20 Sep 2024 6:07 AM GMT
తిరుమలేశుడి సన్నిధిలో దేవర దర్శకుడు..!
X

సినిమా రిలీజ్ లు ముందు పుణ్యక్షేత్రాలు తిరిగి దేవుడి ఆశీస్సులు తీసుకోవడం చాలా కామన్. స్టార్ హీరో సినిమా అయినా చిన్న హీరో సినిమా అయినా సరే సినిమాకు దేవుడి ఆశీస్సులు కూడా ఉండాలని ఆ చిత్ర యూనిట్ పుణ్యక్షేత్రాలకు వెళ్తుంటారు. ముఖ్యంగా అందరు తిరుమల శ్రీనివాసుడి ఆశీర్వాదాలు తీసుకుంటారు. కొందరు సినిమా సక్సెస్ అయ్యాక తిరుపతి వెళ్తే.. కొందరు రిలీజ్ ముందే బాలాజీకి ఒక అప్లికేషన్ వేసి వస్తుంటారు. ఈ క్రమంలో మరో వారం రోజుల్లో పాన్ ఇండియా రిలీజ్ కాబోతున్న దేవర దర్శకుడు కొరటాల శివ కూడా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు.

రైటర్ గా కెరీర్ మొదలు పెట్టి డైరెక్టర్ గా మారిన కొరటాల శివ ఆచార్య ముందు వరకు అన్ని సూపర్ హిట్లే అందుకున్నారు. కానీ ఆచార్య డిజాస్టర్ వల్ల ఆయన వెనక పడ్డారు. ఐతే ఫ్లాప్ లో ఉన్న హీరోతో సినిమా అంటే రిస్కే కానీ డైరెక్టర్ మీద నమ్మకంతో ఎన్టీఆర్ దేవర సినిమా చేశాడు. ఆల్రెడీ ఈ ఇద్దరు కలిసి జనతా గ్యారేజ్ సినిమా తీసి సక్సెస్ అందుకున్నారు.

దేవర సినిమా తో మరోసారి కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబో క్రేజ్ ఏంటన్నది ప్రూవ్ అవుతుంది. ఈ సినిమాకు తన శక్తి మేరకు కష్టపడి పని చేశారు కొరటాల శివ. అందుకే తాను చేయాల్సిందంతా చేశా ఇక అంతా ఆ దేవుడి దయ ప్రేక్షకుల ఆశీర్వాదాలు అని తెలుస్తుంది. అందుకే తిరుమల శ్రీనివాసుడి దర్శనం కోసం కుటుంబ సమేతంగా తిరుపతి వచ్చారు కొరటాల శివ. తారల్, కొరటాల శివ ఈ బాండింగ్ కు ఒక ప్రత్యేకత ఉంది.

దేవర రిలీజ్ ముందు శ్రీవారి దర్శనానికి వచ్చిన కొరటాల శివ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సినిమా ఫలితం బాగుండాలని తిరుమలేశుడి దీవెనల కోసం కొరటాల శివ తిరుపతి వెళ్లారు. దేవర సినిమా విషయానికి వస్తే ఎన్ టీ ఆర్ సరసన జాన్వి కపూర్ హీరోయిన్ గా నటించింది. అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటించారు. సినిమా నుంచి వస్తున్న ప్రతీ కంటెంట్ అంచనాలు పెంచుతుండగా సినిమా కచ్చితంగా ఎన్ టీ ఆర్ స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్ చేస్తుందని అంటున్నారు.