కొరటాల.. ఆచార్య ఎఫెక్ట్ ఉన్నట్లా లేనట్లా?
టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న కొరటాల శివకి మెగాస్టార్ చిరంజీవితో చేసిన ఆచార్య మూవీ కోలుకోలేని దెబ్బ తీసింది.
By: Tupaki Desk | 10 Sep 2024 5:19 AM GMTటాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న కొరటాల శివకి మెగాస్టార్ చిరంజీవితో చేసిన ఆచార్య మూవీ కోలుకోలేని దెబ్బ తీసింది. అంతకు ముందు మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను సినిమాలతో వరుస బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు. అదే ఊపులో ఆచార్య సినిమాతో మరో సూపర్ హిట్ అందుకోవాలని అనుకున్నారు. ఈ సినిమాని మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కించారు.
భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన మూవీ థియేటర్స్ లో ఘోరంగా ఫెయిల్ అయ్యింది. మూవీ కథ, కథనం ఏ ఒక్కటి ప్రేక్షకులకి కనెక్ట్ కాలేదు. ఈ మూవీ కొరటాల ఇమేజ్ ని దారుణంగా దెబ్బ తీసింది. అయితే ఆ ఆచార్య పీడకల నుంచి బయటకొచ్చి కొరటాల శివ జూనియర్ ఎన్టీఆర్ తో పాన్ ఇండియా రేంజ్ లో దేవర చిత్రాన్ని తెరకెక్కించారు. సెప్టెంబర్ 27న ఈ మూవీ థియేటర్స్ లోకి రానుంది. భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది.
దేవర మూవీ నుంచి ఇప్పటి వరకు రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ హెవీగానే ఉన్నాయి. అందుకు తగ్గట్లుగానే ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే తెలుగు రాష్ట్రాలలో ఆచార్య మూవీ ఇంపాక్ట్ దేవరపై పడుతుందా అనే అప్పుడే చెప్పలేం అనే మాట సినీ విశ్లేషకుల వినిపిస్తోంది. ఇప్పటి వరకు ఆచార్య ఇంపాక్ట్ దేవరపై పెద్దగా పడినట్లు కనిపించలేదు.
దేవర మూవీ పైన మంచి బజ్ ఉంది. రిలీజ్ తర్వాత పాన్ ఇండియా రేంజ్ లో దేవర మూవీ క్లిక్ అయ్యి సూపర్ హిట్ సొంతం చేసుకుంటే ఇక కొరటాల శివకి తిరుగుండదు. ఒక వేళ రిజల్ట్ తేడా కొడితే మాత్రం కచ్చితంగా ఆయన కెరియర్ రిస్క్ లో పడినట్లే అని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఈ మూవీ మీద కొరటాల కూడా చాలా హోప్స్ పెట్టుకున్నారు. అదే సమయంలో కాన్ఫిడెంట్ గా ఉన్నారు. చిత్ర యూనిట్ కూడా దేవర బ్లాక్ బస్టర్ అవుతుందని నమ్ముతున్నారు.
సినిమాపై ప్రస్తుతం అయితే పాజిటివ్ వైబ్ నడుస్తోంది. ట్రైలర్ రిలీజ్ తర్వాత కూడా ఇదే కంటిన్యూ అయితే కచ్చితంగా దేవర మూవీ భారీ కలెక్షన్స్ అందుకునే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ మౌత్ టాక్ బట్టి సినిమా సక్సెస్ ఆధారపడి ఉంటుంది. అనిరుద్ రవిచందర్ ఈ సినిమాకి ఎక్స్ ట్రా అడ్వాంటేజ్ అవుతాడని భావిస్తున్నారు. మరి కొరటాల లక్ ఫ్యాక్టర్ దేవర సినిమా విషయంలో ఎలా పనిచేస్తుందో చూడాలి.