దేవర: థియేటర్‌లో హిట్టు.. మరి ఓటీటీలో?
థియేటర్లో ప్రేక్షకులు సినిమాని ఎక్స్ పీరియన్స్ చేయడానికి, ఓటీటీ లేదా టీవీలలో సినిమా చూడటానికి చాలా తేడా ఉంటుంది.
By: Tupaki Desk | 11 Nov 2024 8:47 AM GMTథియేటర్లో ప్రేక్షకులు సినిమాని ఎక్స్ పీరియన్స్ చేయడానికి, ఓటీటీ లేదా టీవీలలో సినిమా చూడటానికి చాలా తేడా ఉంటుంది. బిగ్ స్క్రీన్ మీద గొప్పగా అనిపించిన సీన్, స్మాల్ స్క్రీన్ మీద ఆ ఫీల్ ని కలిగించకపోవచ్చు. ఇటీవల కాలంలో బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిన చాలా మూవీస్, ఓటీటీకి వచ్చాక ట్రోలింగ్ ఎదుర్కొన్నాయి. ఇక్కడ స్కిప్ చేస్తూ సీన్ టూ సీన్ నిశితంగా పరిశీలించే అవకాశం ఉండటంతో, నెటిజన్లు కొందరు బాగాలేని సన్నివేశాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు 'దేవర 1' సినిమా విషయంలోనూ ఇదే జరుగుతోంది.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ''దేవర''. సెప్టెంబర్ నెలాఖరున రిలీజైన ఈ సినిమా టాక్ తో సంబంధం లేకుండా భారీ కలెక్షన్స్ రాబట్టింది. వరల్డ్ వైడ్ గా 500 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, బ్లాక్ బస్టర్ హిట్టయిందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రం రీసెంట్ గా నెట్ ఫ్లిక్స్ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కు వచ్చేసింది. నెంబర్ వన్ స్థానంలో ట్రెండింగ్ లో కొనసాగుతోంది. అయితే ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటున్న ఈ సినిమాకి, ఓ వర్గం ఓటీటీ ఆడియన్స్ నుండి మిశ్రమ స్పందన లభిస్తోంది.
'దేవర 1' చిత్రంలో క్యారెక్టరైజేషన్స్ చాలా బలహీనంగా ఉన్నాయని, రైటింగ్ చాలా పూర్ గా ఉందని, లాజిక్ లేని సీన్స్ ఉన్నాయంటూ డైరెక్టర్ కొరటాల శివను విమర్శిస్తున్నారు. ఎన్టీఆర్ టాలెంట్ ను పూర్తిగా వినియోగించుకోలేకపోయాడని, అతనిలోని బెస్ట్ ను చూపించడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడని ట్రోల్ చేస్తున్నారు. పెద్ద ఎన్టీఆర్ కంటైనర్స్ ను నెట్టుకుంటూ వెళ్లి లోయలో పడేసే సీన్, చిన్న ఎన్టీఆర్ సముద్రంలో నుంచి తిమింగిలాన్ని లాక్కుంటూ వచ్చే సన్నివేశాలను సరిగా తీయలేదని యాంటీ ఫ్యాన్స్ కామెంట్స్ వస్తున్నాయి. ట్రోలింగ్ స్టఫ్ గా మార్చేశాడని అంటున్నారు.
దేవరలో కెమెరామెన్ రత్నవేలు పనితనాన్ని కూడా విమర్శిస్తున్నారు. కొన్ని చోట్ల కెమెరా వర్క్ చాలా దారుణంగా ఉందని, ఎన్టీఆర్ చాలా సన్నివేశాల్లో పొట్టిగా కనిపించేలా ఫ్రేమ్స్ పెట్టాడని అభిప్రాయపడుతున్నారు. అయితే ఊహించినట్లుగానే రెండు పాత్రల్లో తారక్ నటనకు ఓటీటీ ప్రేక్షకుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. ఎన్టీఆర్ నటన, కొన్ని ఎలివేషన్ సీన్స్, వాటర్ బ్యాక్ డ్రాప్ లో సెట్ చేసిన సన్నివేశాలు, ముఖ్యంగా అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ 'దేవర 1' సినిమాని కాపాడాయాయని అంటున్నారు.
ఎన్టీఆర్ స్టార్‌డమ్, ఆయన బాక్సాఫీస్ స్టామినా కారణంగానే, థియేటర్లలో 'దేవర' పార్ట్-1కు ఆ స్థాయిలో వసూళ్లు వచ్చాయని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. కానీ ఓటీటీలో ఈ సినిమాకు రిపీట్ వాల్యూ ఉండదని అంటున్నారు. కొరటాల శివ 'దేవర 2' రైటింగ్, మేకింగ్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. రెండో భాగానికి కావాల్సినంత సమయం ఉంది కాబట్టి, దర్శకుడు ఈసారి ఎలాంటి డ్రాబ్యాక్స్ లేకుండా చూసుకోవాలని కోరుతున్నారు. మరి దర్శకుడు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని 'దేవర 2' కోసం మరింత కష్టపడతారేమో చూడాలి.