దేవర 2.. కొరటాల ఎంత కాలం ఎదురుచూడాలి?
ఈ సినిమా కథ పరంగా మిశ్రమ స్పందనలు వచ్చిన ఎన్టీఆర్ వన్ మెన్ షోతో థియేటర్స్ లో మంచి ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంటుంది.
By: Tupaki Desk | 5 Oct 2024 7:22 AM GMTస్టార్ డైరెక్టర్ కొరటాల శివ వరుసగా నాలుగు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ అందుకున్న తర్వాత ‘ఆచార్య’ మూవీతో ఎవ్వరూ ఊహించని స్థాయిలో డిజాస్టర్ సొంతం చేసుకున్నారు. ఈ మూవీ కొరటాల ఇమేజ్ ని కూడా దెబ్బతీసింది. అయితే ఈ ఎఫెక్ట్ నుంచి కోలుకొని మరల ఎన్టీఆర్ తో ‘దేవర’ మూవీ చేసి ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు. ఈ సినిమా కథ పరంగా మిశ్రమ స్పందనలు వచ్చిన ఎన్టీఆర్ వన్ మెన్ షోతో థియేటర్స్ లో మంచి ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంటుంది.
ఇప్పటికే కలెక్షన్స్ కూడా 400 కోట్లు క్రాస్ అయ్యాయి. లాంగ్ రన్ లో ఈ మూవీ 550-600 కోట్ల మధ్యలో కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. ‘దేవర’ మూవీని కొరటాల రెండు భాగాలుగా తెరకెక్కించనున్నట్లు గతంలో ప్రకటించాడు. అయితే ‘దేవర 2’ మూవీ స్టార్ట్ కావడానికి రెండేళ్లకి పైగా సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. దీనికి కారణం ఎన్టీఆర్ బ్యాక్ టూ బ్యాక్ రెండు సినిమాలు లైన్ లో పెట్టడమే. ప్రస్తుతం ఎన్టీఆర్ హిందీలో చేస్తోన్న ‘వార్ 2’ షూటింగ్ దశలో ఉంది.
దీని తర్వాత ‘డ్రాగన్’ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ రెండు కంప్లీట్ అయ్యాకనే ‘దేవర పార్ట్ 2’ చిత్రాన్ని తారక్ స్టార్ట్ చేస్తాడంట. ఈ రెండేళ్ల కాలంలో కొరటాల ఇంకో సినిమా కంప్లీట్ చేయాలనే ప్లానింగ్ లో ఉన్నారని తెలుస్తోంది. అయితే ఆయన దర్శకుడిగా కెరియర్ స్టార్ట్ చేసింది యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో అనే సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఆయన నుంచి వచ్చిన ఆరు సినిమాలు టైర్ 1 హీరోలతో చేసినవే. అయితే ఇప్పుడు టైర్ 1 హీరోలు ఎవరు ఖాళీగా లేరు. ఒక్కొక్కరు రెండు, మూడు సినిమాలు లైన్ లో పెట్టుకున్నారు.
అలా అని టైర్ 2 హీరోలతో కొరటాల సినిమాలు చేయడానికి సిద్ధంగా లేరనే మాట వినిపిస్తోంది. కొరటాల ఇమేజ్ కి సరిపోయే టైర్ 2 హీరో అంటే ఒక్క నాని కనిపిస్తాడు. అతను కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇలాంటి పరిస్థితిలో కొరటాల శివ దేవర 2 మూవీ స్టార్ట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే తప్ప మరో సినిమా చేయడం కష్టం అనే ప్రచారం నడుస్తోంది. కొరటాల శివ కూడా ‘దేవర 2’ ని మరింత డిఫరెంట్ చూపించాలి అనుకుంటున్నాడంట.
స్క్రిప్ట్ పరంగా మరల కొన్ని మార్పులు చేర్పులు చేసి మరింత గ్రాండ్ గా కథని చెప్పాలని ప్లాన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది. ఒక వేళ టైర్ 1 హీరో దొరక్కుంటే 2026 వరకు దేవర 2 కథ పైన కొరటాల శివ వర్క్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పుకుంటున్నారు. ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియాలంటే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి కొరటాల శివ క్లారిటీ ఇచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.