Begin typing your search above and press return to search.

దేవర కథ.. కొరటాల ఏం మార్చాడు?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘దేవర’ మూవీకి థియేటర్స్ లో టాక్ కాస్త మిక్స్ డ్ గా వచ్చినా కూడా ప్రేక్షకాదరణ బాగానే ఉంది.

By:  Tupaki Desk   |   6 Oct 2024 6:31 AM GMT
దేవర కథ.. కొరటాల ఏం మార్చాడు?
X

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘దేవర’ మూవీకి థియేటర్స్ లో టాక్ కాస్త మిక్స్ డ్ గా వచ్చినా కూడా ప్రేక్షకాదరణ బాగానే ఉంది. రెండో వారంలోకి అడుగుపెట్టిన మూవీకి డీసెంట్ కలెక్షన్స్ వస్తున్నాయి. నిజానికి మొదటి రోజు వచ్చిన టాక్ బట్టి చూస్తే ఈ పాటికే ‘దేవర’ కి ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ తగ్గిపోయి ఉండాలి. కాని ఎన్టీఆర్ వన్ మెన్ షో పెర్ఫార్మెన్స్ కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. కలెక్షన్స్ కూడా 500 కోట్ల దిశగా దూసుకెళ్తున్నాయి.

ఇదిలా ఉంటే ఈ సినిమా స్టోరీ నేరేషన్ గురించి ఇంటరెస్టింగ్ ప్రచారం ఇప్పుడు సోషల్ మీడియాలో నడుస్తోంది. నిజానికి ‘దేవర’ మూవీ కథని కొరటాల శివ వేరే విధంగా ప్లాన్ చేశారు. సెకండ్ హాఫ్ లో ఉన్న వర క్యారెక్టర్ తో ఫస్ట్ హాఫ్ కథని చెబుతూ ఎడిటింగ్ కాపీ సిద్ధం చేసారంట. దేవర కథని ఇంటర్వెల్ బ్యాంగ్ లో రివీల్ చేసి సెకెండాఫ్ లో ఆవిష్కరించారని టాక్. ఈ కాపీ సిద్ధం చేసిన తర్వాత టీం ఫీడ్ బ్యాక్ ని కొరటాల శివ తీసుకున్నారనే మాట వినిపిస్తోంది.

అయితే ఈ అవుట్ పుట్ చూసిన తర్వాత ‘బాషా’ తరహాలో ప్రెజెంటేషన్ ఉందనే అభిప్రాయాన్ని మూవీ టీం అందరూ చెప్పారంట. ‘బాషా’ తరహా కథలతో ఇండియాలో వివిధ భాషలలో సినిమాలు వచ్చాయి. ఇంద్ర, సమరసింహారెడ్డి, నరసింహానాయుడు లాంటి సినిమాల స్టొరీ నేరేషన్ కూడా ‘బాషా’ మూవీ తరహాలోనే ఉంటుంది. అయితే ఆ సినిమాల సక్సెస్ కి ఆ నేరేషన్ స్టైల్ ఒక కారణం అని చెప్పొచ్చు. ప్రభాస్ ‘సలార్’ మూవీ కథ నేరేషన్ కూడా అదే తరహాలో ఉంటుంది.

ఈ సినిమా కమర్షియల్ గా మంచి విజయాన్ని అందుకుంది. ‘పుష్ప’ మూవీ నేరేషన్ స్ట్రైట్ ఫార్మాట్ లో ఉంటుంది. స్టొరీ నడుస్తున్న కొద్ది పుష్పరాజ్ క్యారెక్టర్ పవర్ ఫుల్ గా మారుతుంది. ఈ రెండు సినిమాలకి ఫస్ట్ హాఫ్ స్లోగా ఉందనే టాక్ వచ్చిన సెకెండాఫ్ అద్భుతంగా ఉండటంతో పాటు క్లైమాక్స్ ఎలివేషన్ గూస్ బాంబ్స్ లా ఉంటుంది. ఈ ఫార్మాట్ ఆడియన్స్ కి భాగా కనెక్ట్ అయ్యింది. ఆ సినిమాల సక్సెస్ కి సెకెండాఫ్ నేరేషన్ ఒక కారణం అని చెప్పొచ్చు.

దేవర మూవీ కథని కొరటాల శివ ముందుగా ఇదే ఫార్మాట్ లో చెప్పారని టాక్. అయితే టీం ఒపీనియన్ తీసుకొని మార్పులు చేసి దేవర కథని ఫస్ట్ హాఫ్ లో చెప్పి సెకెండాఫ్ లో వర కథని ప్రెజెంట్ చేశారు. జాన్వీ కపూర్ కి కూడా స్క్రీన్ టైమింగ్ తగ్గడానికి ఇది ఒక కారణం అని చెప్పొచ్చు. అలా కాకుండా కొరటాల శివ ముందు రెడీ చేసిన అవుట్ పుట్ ని ఫైనల్ చేసి ఉంటే ఇప్పుడొచ్చిన రెస్పాన్స్ కంటే ఎక్కువ పాజిటివ్ టాక్ లభించేదని సినీ విశ్లేషకులు అంటున్నారు. అయితే స్టొరీ నేరేషన్ మార్చడంతో సెకెండాఫ్ భాగా వీక్ అయ్యిందని పబ్లిక్ నుంచి స్పందన వచ్చింది. మిక్స్డ్ రివ్యూలు రావడానికి సెకెండాఫ్ కారణం ఒక అని చెప్పొచ్చు.