కొరటాల, మహేష్.. నిజమేనా?
ఇప్పటికే రూ.400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన దేవర.. దసరా సెలవులు కావడంతో రిలీజ్ అయిన అన్ని సెంటర్స్ లో మంచి కలెక్షన్స్ సాధిస్తోంది.
By: Tupaki Desk | 6 Oct 2024 6:30 AM GMTటాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ.. దేవర పార్ట్-1 మూవీతో కమ్ బ్యాక్ ఇచ్చిన విషయం తెలిసిందే! యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ఆ సినిమా.. సెప్టెంబర్ 27వ తేదీన వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించగా.. నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ గా కనిపించారు. ఇప్పటికే రూ.400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన దేవర.. దసరా సెలవులు కావడంతో రిలీజ్ అయిన అన్ని సెంటర్స్ లో మంచి కలెక్షన్స్ సాధిస్తోంది.
అయితే కొరటాల నెక్స్ట్ ఏంటి అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మెగాస్టార్ చిరంజీవి ఆచార్య తర్వాత దేవర పార్ట్-1 మూవీ చేసి హిట్ అందుకున్నారు కొరటాల శివ. దేవర పార్ట్-2 కూడా చేయాల్సి ఉన్నా.. అందుకు కాస్త టైమ్ పట్టేట్లు కనిపిస్తుంది. దీంతో కొరటాల.. తర్వాత ఏ హీరోతో వర్క్ చేయనున్నారనేది ఇంకా ఫిక్స్ కాలేదు. అందుకు సంబంధించిన ఎలాంటి అనౌన్స్మెంట్ కూడా రాలేదు. దీంతో అంతా అందరూ కొరటాల నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం మాట్లాడుకుంటున్నారు.
ముఖ్యంగా టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్, రామ్ చరణ్, మహేష్ బాబు.. తమ అప్ కమింగ్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు! కొందరు షూటింగ్స్ లో పాల్గొంటుంటే.. మరికొందరు ఇప్పటికే సైన్ చేసి సినిమాల కోసం సన్నద్ధమవుతున్నారు. త్వరలో సెట్స్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. అదే సమయంలో మహేష్ బాబుతో కొరటాల శివ వర్క్ చేయవచ్చనే ఓ వార్త చక్కర్లు కొడుతోంది. కానీ అది అసలు జరిగే పని కాదన్న విషయం తెలిసిందే.
ఎందుకంటే.. ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళితో చేయనున్న ప్రాజెక్టు కోసం మేకోవర్ చేసుకునే పనిలో ఉన్నారు. లాంగ్ హెయిర్, గుబురు గడ్డంతో కొద్ది రోజులుగా అనేక సార్లు కెమెరాకు మహేష్ చిక్కారు. సినిమాలో ఆయన లుక్ ఆ విధంగానే ఉండబోతుందనే టాక్ వినిపిస్తోంది. త్వరలో SSMB 29 మూవీ సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తోంది. ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. దీంతో కొన్ని రోజుల పాటు మహేష్ బాబు ఖాళీగా ఉన్నట్లే!
అందుకే ఆ గ్యాప్ లో మహేష్ బాబుతో కొరటాల సినిమా చేయనున్నారని టాక్ వస్తోంది. కానీ అది అలా జరిగే అవకాశం అస్సలు లేదు. మహేష్ మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు.. రాజమౌళి అసలు ఒప్పుకోరు! కాబట్టి ఇప్పట్లో కొరటాల, మహేష్ కాంబోలో సినిమా తెరకెక్కడం దాదాపు అసాధ్యమే. అయితే ఇప్పటికే కొరటాల డైరెక్షన్ లో మహేష్ బాబు భరత్ అనే నేను సినిమా చేసిన విషయం తెలిసిందే.