Begin typing your search above and press return to search.

కొరటాలకు ఒక్క హిట్టు పడితే.. ఇద్దరు దొరికినట్టే..

దేవర తర్వాత కొరటాల శివ సూపర్ స్టార్ మహేష్ బాబు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమాలు చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   14 Sep 2024 5:18 AM GMT
కొరటాలకు ఒక్క హిట్టు పడితే.. ఇద్దరు దొరికినట్టే..
X

వరుసగా నాలుగు సూపర్ హిట్స్ తో టాలీవుడ్ స్టార్ దర్శకుల జాబితాలో కొరటాల శివ చేరారు. అయితే మెగాస్టార్ చిరంజీవితో చేసిన ఆచార్య మూవీ కొరటాల శివ ఇమేజ్ ని ఒక్కసారిగా క్రిందికి లాగేసింది. ఆ మూవీ కారణంగా కొరటాల శివ దారుణంగా ట్రోలింగ్ కి గురయ్యారు. మంచి టాలెంటెడ్ రైటర్ కమ్ డైరెక్టర్ అనే ఇమేజ్ ఉన్నా కూడా ఆచార్య మూవీ ఫెయిల్యూర్ ఇంపాక్ట్ మొత్తం కొరటాల శివ మీదనే పడింది. దాని నుంచి కోలుకొని ఎన్టీఆర్ తో దేవర మూవీని గ్రాండ్ గా పాన్ ఇండియా లెవెల్లో తెరపైకి తీసుకు వచ్చారు.

ఈ సినిమా సెప్టెంబర్ 27న పాన్ ఇండియా రేంజ్ లో ఐదు భాషలలో రిలీజ్ అవుతోంది. సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. కచ్చితంగా బ్లాక్ బస్టర్ సక్సెస్ కొట్టాలనే కసితో కొరటాల శివ వర్క్ చేశారు. ప్రస్తుతం ప్రమోషన్ యాక్టివిటీస్ నడుస్తున్నాయి. కొరటాల శివకి దేవర సక్సెస్ చాలా అవసరం. కెరియర్ లో మరల నిలబడి స్టార్ హీరోలతో మూవీస్ చేయాలంటే కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకోవాలి.

దేవర తర్వాత కొరటాల శివ సూపర్ స్టార్ మహేష్ బాబు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమాలు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు జక్కన్నతో మూవీ చేయబోతున్నారు. పాన్ వరల్డ్ రేంజ్ లో ఈ చిత్రం తెరకెక్కనుంది. దీని తర్వాత మహేష్ ఛాయస్ గా సందీప్ రెడ్డి వంగాతో పాటు కొరటాల శివ కూడా ఉన్నారు. మహేష్ బాబుకి కొరటాల శివ శ్రీమంతుడు, భరత్ అనే నేను సినిమాలతో రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చారు.

అయిన కూడా దేవర మూవీతో పాన్ ఇండియా లెవల్ లో సెన్సేషన్ హిట్ ని కొరటాల శివ అందుకుంటే నెక్స్ట్ మహేష్ బాబు ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొరటాల శివకి ఛాన్స్ ఇవ్వాలన్న కూడా అది దేవర మూవీ సక్సెస్ పైన ఆధారపడి ఉంటుంది. పుష్ప తో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా లెవల్ లో తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. పుష్ప 2పైన భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

నెక్స్ట్ చేయబోయే మూవీ పుష్ప సిరీస్ కి మించి ఉండాలని బన్నీ అనుకుంటున్నారు. దేవర మూవీ గ్రాండ్ సక్సెస్ అయితే అప్పుడు అల్లు అర్జున్ కొరటాలతో సినిమా గురించి ఆలోచించే ఛాన్స్ ఉందంట. అంటే కొరటాలతో ఏ స్టార్ హీరో మూవీ చేయాలన్న కూడా అది పూర్తిగా దేవర సక్సెస్ పైన ఆధారపడి ఉంటుందని అనిపిస్తుంది. మరి ఆయన కష్టం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.