Begin typing your search above and press return to search.

దేవర కథ... 12 ఏళ్ళ జర్నీ

ఈ మధ్యకాలంలో తెలుగులో ఎక్కువగా పీరియాడికల్ జోనర్ లో సినిమాలు తెరకెక్కుతున్నాయి.

By:  Tupaki Desk   |   26 Sep 2024 4:05 AM GMT
దేవర కథ... 12 ఏళ్ళ జర్నీ
X

ఈ మధ్యకాలంలో తెలుగులో ఎక్కువగా పీరియాడికల్ జోనర్ లో సినిమాలు తెరకెక్కుతున్నాయి. స్టార్ డైరెక్టర్స్ నుంచి కొత్తగా వచ్చిన దర్శకుల వరకు చాలామంది పర్టిక్యులర్ పీరియాడికల్ టైమ్ లైన్ లో జరిగిన కథాంశంగా మూవీ స్టోరీ చెప్తున్నారు. ఈ ఫార్మాట్ కి ప్రేక్షకుల నుంచి కూడా ఆదరణ లభిస్తోంది. అందుకే ఎక్కువగా ఇదే శైలిని దర్శకులు అనుసరిస్తున్నారు. మరికొందరు చరిత్రలో జరిగిన కొన్ని రియల్ సంఘటనల స్ఫూర్తితో కథలు సిద్ధం చేసుకుని తెరపై ఆవిష్కరిస్తున్నారు.

ఇక కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా రాబోతున్న ‘దేవర’ సినిమా కథాంశం కూడా 80s నుంచి 90s మధ్యలో జరిగిన కథగా ఉండబోతుందంట. ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో కొరటాల శివ స్పష్టం చేశారు. పర్టిక్యులర్ గా కొన్ని సంఘటనలు ఆ టైమ్ పీరియడ్ లో జరిగాయి. అందుకే దేవర సినిమా సెటప్ అంతా కూడా 80 నుంచి 90 దశకం మధ్యలోనే పెట్టడం జరిగిందని వివరణ ఇచ్చారు.

‘దేవర’ కథను 2000-2010 మధ్యకాలంలో చెప్పలేమని స్పష్టం చేశారు. ఈ సినిమాలో 12 ఏళ్ళ జర్నీ ఉంటుందని తెలియజేశారు. కొరటాల శివ చెప్పిన మాటల బట్టి రియల్ సంఘటన స్ఫూర్తితోనే ‘దేవర’ కథని రాసి ఉంటారనే మాట వినిపిస్తోంది. ఇదిలా ఉంటే సినిమా రిలీజ్ కి ఇంకా ఒక్కరోజు మాత్రమే సమయం ఉంది. మూవీ పైన భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఎన్టీఆర్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చిత్రంగా ‘దేవర’ నిలుస్తుందని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు.

ఖచ్చితంగా మొదటి రోజు 100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధిస్తుందని ట్రేడ్ పండితులు కూడా లెక్కలు కడుతున్నారు. ఇక సినిమా కథాంశం గురించి కొరటాల చెప్పిన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ కూడా జనాల్లోకి బలంగా వెళ్ళింది. దీంతో ‘దేవర’ సినిమా చూడడం కోసం ఫ్యాన్స్ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ కోసం యూఎస్ వెళ్లారు. అక్కడ ఈ రోజు ప్రదర్శించబోయే ప్రీమియర్ షోలని తిలకించి అభిమానులని పలకరిస్తారు. తారక్ ని చూసేందుకు ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

కల్కి తర్వాత టాలీవుడ్ నుంచి రాబోతున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కావడంతో ‘దేవర’ పైన అందరి ఫోకస్ ఉంది. ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందా అని అంతా ఎదురుచూస్తున్నారు. మూవీ హిట్ అయితే ఎన్టీఆర్ మార్కెట్ రేంజ్ అమాంతం పెరిగిపోతుంది. ‘దేవర 2’ పైన ఎక్స్ పెక్టేషన్స్ మరింత ఎక్కువ అవుతాయి. ఇక మూవీలో జాన్వీ కపూర్ అందాలు, సైఫ్ అలీఖాన్ పెర్ఫార్మెన్స్ చూడటానికి కూడా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.