'దేవర-2'కి రిపేర్లు? ఆ ఛాన్స్ ఇవ్వకుండా?
కొరటాల ఆచార్య వరల్డ్ నుంచి బయటకు రాలేదనే విమర్శలు వ్యక్తమయ్యాయి.
By: Tupaki Desk | 6 Oct 2024 2:30 PM GMT'దేవర' కలెక్షన్ల పరంగా చూసే పనిలేదు. ఇప్పటికే 400 కోట్ల వసూళ్లను రాబట్టింది. 500 కోట్ల క్లబ్ లో చేరుతుందనే ట్రేడ్ అంచనా వేస్తోంది. ఆరకంగా 'దేవర' బ్లాక్ బస్టర్ . అందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ ఇదే సినిమాపై విమర్శలు కూడా తీవ్రంగానే ఉన్నాయి. రివ్యూలు ఏమంత ఆశాజనకంగా లేవు. రోటీన్ కాన్సెప్ట్ తో తీసిన చిత్రంగానే క్రిటిక్స్ తేల్చేసారు. కొరటాల ఆచార్య వరల్డ్ నుంచి బయటకు రాలేదనే విమర్శలు వ్యక్తమయ్యాయి.
థియేటర్ల వద్ద ఓ సెక్షన్ ఆడియన్స్ పాజిటివ్ గా స్పందించలేదు. వారు సైతం రోటీన్ చిత్రంగానే భావించారు. అంతిమంగా వసూళ్లే కీలకం కాబట్టి ఆ ప్రాతిపదికన `దేవర-2`ని మేకర్స్ కన్పమ్ చేసారు. అయితే అందుకు రెండేళ్లు సమయం తీసుకుంటున్నారు. మరి ఇంత సమయం దేనికి అంటే స్టోరీ రిపేర్లు చేయడానికే అన్నట్లు కనిపిస్తుంది. కొరటాల `దేవర` కథని మొత్తంగా రాసిన తర్వాత రెండు భాగాలు గా విభిజించి చేసారు.
అదీ సినిమా సెట్స్ కి వెళ్లిన తర్వాత మధ్యలో రెండు భాగాలు చేసారు. ఇప్పుడు ఆ లెక్కలోనే `దేవర -2` చేస్తారు. అయితే పార్ట్ -2 కథకి మరిన్ని మెరుగులు దిద్దాలని కోరటాల తాజాగా ప్రకటించారు. తొలి భాగంలో వచ్చిన విమర్శలు మలిభాగంలో లేకుండా కొరటాల కథని మరింత సానబెట్టనున్నట్లు తెలుస్తోంది. మొదటి భాగంలో తలెత్తిన సందేహాలన్నింటికి రెండవ భాగంలో చిక్కు ముడి ఇప్పాల్సి ఉంది.
వాటిని ఎంతో ఎంగేజింగ్ గానూ చెప్పాలి. కొరటాల తొలిసారి విమర్శలకు గురైంది ఆచార్య విషయంలోనే. అక్కడో రీజన్ హైలైట్ అయింది. ఆయన కథలో మరికొంత మంది వేలు పెట్టడంతోనే అలా జరిగిందనే ఆరోపణ ఉంది. కానీ దేవర విషయంలో అంతా తానై పనిచేసాడు. అయినా విమర్శలొచ్చాయి. అంటే ఇప్పుడు కొరటాల సైతం మరింత జాగ్రత్తగా కథలు రాయాల్సిన అవసరం ఏర్పడింది. మరి మొదటి భాగంపై వచ్చిన విమర్శలకు రెండవ భాగంతో తుడిచిపెట్టేలా? కథా, సన్నివేశాలుండాలని అభిమానులు ఆశిస్తున్నారు.