Begin typing your search above and press return to search.

AA21 - దేవర కనెక్షన్.. కొరటాల శివ ఏమన్నారంటే..

ఇటీవల విడుదలైన రిలీజ్ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ, అన్ని భాషల్లో పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది.

By:  Tupaki Desk   |   24 Sep 2024 8:38 AM GMT
AA21 - దేవర కనెక్షన్.. కొరటాల శివ ఏమన్నారంటే..
X

రెండు భాగాలుగా రూపొందుతున్న దేవర మూవీ మొదటి భాగం ఈ వారం గ్రాండ్ గా విడుదల కానున్న విషయం తెలిసిందే. సినిమాకు సంబంధించిన బుకింగ్స్ సైతం గట్టిగానే కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల విడుదలైన రిలీజ్ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ, అన్ని భాషల్లో పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది.

అయితే మొదటి ట్రైలర్ కూడా పరవాలేదు అనేలా వ్యూవ్స్ పరంగా సక్సెస్ అయ్యింది. అయితే అప్పుడే, సోషల్ మీడియాలో ఒక ఆసక్తికర చర్చ జరిగింది. మొదట ఈ కథని అల్లు అర్జున్ చేయాల్సి ఉందనే రూమర్ వచ్చింది. దానికి కారణం లేకపోలేదు. ఎందుకంటే 2020లో కొరటాల శివ AA21 అనే ప్రాజెక్ట్ ను అల్లు అర్జున్ తో కలిసి అనౌన్స్ చేశారు.

ఈ సినిమా కోసం యువసుధా ఆర్ట్స్ మరియు గీతా ఆర్ట్స్ కలిసి ప్రొడ్యూస్ చేయాలని ప్లాన్ చేశారు. ఒక థీమ్ పోస్టర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అప్పట్లో అల్లు అర్జున్ పుష్ప షూటింగ్ తో బిజీగా ఉండటంతో ఈ ప్రాజెక్ట్ ఆలస్యం అవుతూ వచ్చింది. ఇదే సమయంలో కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య సినిమా చేశారు, కానీ అది ఆశించిన విజయాన్ని సాధించలేదు.

ఆచార్య సినిమా ఫలితంతో కొరటాల శివకు కష్టాలు మొదలైనట్టే అనిపించింది. దీంతో అల్లు అర్జున్‌తో చేయాలనుకున్న ప్రాజెక్ట్ ఆగిపోయిందనే వార్తలు వినిపించాయి. తర్వాత కొరటాల శివ, ఎన్టీఆర్‌తో సినిమా చేయడానికి సిద్ధమయ్యారు. ఇప్పుడు అదే దేవర గా రూపొందిందని కథనాలు వెలువడ్డాయి. సోషల్ మీడియాలో వచ్చే ఊహాగానాల ప్రకారం, AA21 కోసం అనుకున్న కథను కొరటాల శివ ఎన్టీఆర్‌తో దేవర గా మార్చారని టాక్ వచ్చింది.

అప్పటి AA21 థీమ్ పోస్టర్, ఇప్పుడు ఉన్న దేవర మూవీ కంటెంట్ మధ్య చాలా పోలికలు కనిపిస్తున్నాయంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ టాక్ పటిష్టంగా ఉండటానికి కారణం, మొదట కొరటాల శివ దీనిపై సరైన క్లారిటీ ఇవ్వకపోవడమే. ఇక ఫైనల్ గా ఆయన ఈ రూమర్స్ కు చెక్ పెడుతూ ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

దేవర సినిమాకు అల్లు అర్జున్ తో చేయాలని అనుకున్న కథకు ఎలాంటి రిలేషన్ లేదని కొరటాల ఇటీవల ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చేశారు. అది పూర్తిగా మరొక భిన్నమైన కథ అని కూడా అన్నారు. అలాగే బన్నీతో కూడా భవిష్యత్తులో సినిమా ఉంటుందని చాలాసార్లు కొరటాల క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం కొరటాల దేవర సక్సెస్ కోసం సినిమాను స్ట్రాంగా జనాల్లోకి తీసుకు వెళుతున్నారు. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.