Begin typing your search above and press return to search.

కొరటాల శివ.. ఇది దేవర ధైర్యం

టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న దర్శకుడు కొరటాల శివ

By:  Tupaki Desk   |   15 Jun 2024 8:21 AM GMT
కొరటాల శివ.. ఇది దేవర ధైర్యం
X

టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న దర్శకుడు కొరటాల శివ. ఆయన సినిమాలలో రెగ్యులర్ హీరోయిజం కనిపించదు. సామాజిక స్పృహ కలిగిన పాత్రలలలో హీరోలు కనిపిస్తూ ఉంటారు. సామాజిక కోణంలోనే కొరటాల శివ సినిమాలు కథలు అన్ని ఉంటారు. మిర్చి, శ్రీమంతుడు, జనతాగ్యారేజ్, భారత్ అనే నేను సినిమాలు మూడు క్లాస్ టచ్ తో సాగే మాస్ సినిమాలుగా ఉన్నాయి. ఈ నాలుగు సూపర్ హిట్ అయ్యాయి.

తరువాత మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య సినిమా చేశారు. ఇందులో రామ్ చరణ్ కూడా ఒక హీరోగా కనిపించాడు. అయితే ఆచార్య మూవీ కథనం గాడితప్పడంతో డిజాస్టర్ అయ్యింది. కొరటాల ఇమేజ్ ని కూడా ఆచార్య మూవీ డ్యామేజ్ చేసింది. సినిమాపై దారుణమైన ట్రోల్స్ నడిచాయి. సినిమా డిజాస్టర్ కావడానికి కొరటాల శివ కారణం అన్నట్లు ప్రాజెక్ట్ చేశారు. ఆ సినిమా తర్వాత కొరటాల శివ చాలా గ్యాప్ తీసుకొని దేవర స్క్రిప్ట్ రెడీ చేసి తారక్ తో సెట్స్ పైకి తీసుకొని వెళ్లారు.

దేవర మూవీ కోసం ఎన్టీఆర్ సైతం ఏడాది పాటి మరో సినిమా చేయకుండా వెయిట్ చేశారు. దీనిని బట్టి కొరటాలపై తారక్ ఎంత నమ్మకం పెట్టుకున్నారో అర్ధం చేసుకోవచ్చు. తాజాగా కొరటాల శివ బర్త్ డే సందర్భంగా దేవర మూవీ టీమ్ అతనికి విషెస్ తెలియజేసింది. అలాగే షూటింగ్ ఫోటోలని వీడియోలని ట్విట్టర్ లో పంచుకున్నారు. అవి కాస్తా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

దేవర మూవీతో కొరటాల శివ కచ్చితంగా బ్లాక్ బస్టర్ కొట్టాల్సిన అవసరం ఉంది. ఆచార్య మూవీ తర్వాత విమర్శించిన అందరికి దేవరతో కొరటాల శివ సమాధానం చెబుతాడని ఆయన అభిమానులు భావిస్తున్నారు. దేవర మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. కంప్లీట్ యాక్షన్ ప్యాక్డ్ కథాంశంతో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇప్పటికే ఆల్ మోస్ట్ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. కొరటాల శివ ఈ చిత్రం కోసం చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారంట. దేవర పై చాలా ధైర్యంగా ఉన్నారు.

ప్రతి విషయాన్ని చాలా కేర్ ఫుల్ గా హ్యాండిల్ చేస్తున్నారు. షూటింగ్ ఆలస్యం అయిన పెర్ఫెక్షన్ చూసుకొని తెరకెక్కిస్తున్నారు. అందుకే షెడ్యూల్, షెడ్యూల్ కి గ్యాప్ తీసుకుంటున్నారు. దేవర మూవీపైన 400+ కోట్లకి పైగా బిజినెస్ జరగబోతోందని తెలుస్తోంది. సైఫ్ అలీఖాన్, జాన్వీ కపూర్ లాంటి స్టార్ క్యాస్టింగ్ ని తీసుకొని దేవర సినిమాపై హై ఎండ్ లో కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు. కచ్చితంగా దేవరతో కొరటాల బౌన్స్ బ్యాక్ కావడం గ్యారెంటీ అనే మాట వినిపిస్తోంది.