Begin typing your search above and press return to search.

ఆ దర్శకుడికి ఎన్టీఆర్‌ డెడ్‌ లైన్‌...?

యంగ్‌ టైగర్ ఎన్టీఆర్‌ ప్రస్తుతం దేవర మరియు వార్‌ 2 సినిమాల్లో నటిస్తున్నాడు

By:  Tupaki Desk   |   12 Jun 2024 5:10 AM GMT
ఆ దర్శకుడికి ఎన్టీఆర్‌ డెడ్‌ లైన్‌...?
X

యంగ్‌ టైగర్ ఎన్టీఆర్‌ ప్రస్తుతం దేవర మరియు వార్‌ 2 సినిమాల్లో నటిస్తున్నాడు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ సినిమా చేయాల్సి ఉంది. ఆర్‌ఆర్‌ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ సినిమాకు చాలా గ్యాప్‌ వచ్చింది. దేవర సినిమాను ఏప్రిల్‌ లోనే విడుదల చేయాలని భావించినా సాధ్యం అవ్వలేదు.

ఏప్రిల్‌ నుంచి ఏకంగా అక్టోబర్ కి దేవర సినిమా వాయిదా పడ్డ విషయం తెల్సిందే. అక్టోబర్ కూడా సమీపిస్తున్న నేపథ్యంలో షూటింగ్‌ త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నారట. ఆగస్టు వరకు ఖచ్చితంగా దేవర సినిమా షూటింగ్‌ మొత్తం పూర్తి చేయాల్సిందిగా కొరటాల శివకు ఎన్టీఆర్‌ డెడ్‌ లైన్ పెట్టాడని వార్తలు వస్తున్నాయి.

కొరటాల శివ గత చిత్రం ఆచార్య భారీ డిజాస్టర్‌ గా నిలిచిన నేపథ్యంలో ఆయన ఈ సినిమాపై కాస్త ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్నాడు. దాంతో ఎక్కువ రోజులు షూటింగ్‌ కు సమయం పడుతుందని సమాచారం అందుతోంది. ఈ విషయం లో ఎన్టీఆర్‌ అసంతృప్తిగా ఉన్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.

కొరటాల శివ స్క్రిప్ట్‌ విషయంలో కిందా మీద పడుతున్న సమయంలో ఎన్టీఆర్‌ కూడా తనవంతు సహకారం అందించాడు అనేది టాక్. ఎన్టీఆర్‌ స్క్రిప్ట్‌ విషయంలో ముఖ్యంగా చివరి దశ షూటింగ్‌ కి సంబంధించి ఎన్టీఆర్‌ చాలా ఇన్‌పుట్స్ ఇస్తున్నాడు అంటూ యూనిట్‌ సభ్యులు ఆఫ్‌ ది రికార్డ్‌ చెబుతున్నారు.

ఎన్టీఆర్‌ వార్‌ 2 సినిమా కోసం బల్క్ డేట్లు ఇవ్వాల్సి ఉంది. అప్పటి వరకు దేవర సినిమా షూటింగ్‌ పూర్తి చేయాలనే గట్టి పట్టుదలతో ఉన్నాడు. అందుకే దర్శకుడు కొరటాల శివకు డెడ్‌ లైన్ పెట్టాడు అంటూ వార్తలు వస్తున్నాయి.

అక్టోబర్ లో దేవర ను విడుదల చేయకుంటే ఖచ్చితంగా ఆ తర్వాత మంచి డేట్‌ దొరకడం కష్టం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అందుకే ఎన్టీఆర్‌ అక్టోబర్‌ 10న విడుదల చేయాలని పట్టుదలతో ఉన్నాడట. మేకర్స్‌ అంతా కూడా అదే విధంగా ప్లాన్‌ చేస్తున్నారు.