Begin typing your search above and press return to search.

ఆ నాయకుడితో కొరటాల.. ఏం చెప్పబోతున్నారు?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం ఎన్టీఆర్ తో దేవర చిత్రాన్ని కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు.

By:  Tupaki Desk   |   13 Aug 2024 10:47 AM GMT
ఆ నాయకుడితో కొరటాల.. ఏం చెప్పబోతున్నారు?
X

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం ఎన్టీఆర్ తో దేవర చిత్రాన్ని కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం జరుగుతోంది. సెప్టెంబర్ 27న దేవర పార్ట్ 1 థియేటర్స్ లోకి రాబోతోంది. ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత కొరటాల శివ నుంచి దేవర మూవీ వస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఏడాది గ్యాప్ తీసుకొని కొరటాలతో ఈ మూవీ చేశారు. ఈ సినిమాపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా ఎక్స్ పెక్టేషన్స్ తో ఉన్నారు.

కొరటాల శివ దర్శకుడిగా మారిన తర్వాత మొదటి నుంచి తన సినిమాలలో ఏదో ఒక సామాజిక అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రేక్షకులకి కనెక్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. మిర్చి చిత్రం నుంచి భరత్ అనే నేను వరకు ప్రతి సినిమాలో కూడా సామాజిక సందేశం ఉంటుంది. మెగాస్టార్ తో ఆచార్య చిత్రాన్ని కూడా అలాగే చేయాలని అనుకున్నారు. దేవాలయాల పరిరక్షణ, ఆయుర్వేదం గురించి మంచి సందేశాన్ని కథలో భాగంగా చెప్పాలని ప్రయత్నం చేశారు. అయితే అది ఆడియన్స్ కి కనెక్ట్ కాలేదు.

ఇప్పుడు దేవర చిత్రాన్ని మాత్రం హైవోల్టేజ్ యాక్షన్ ప్యాక్డ్ కథాంశంతో ఫిక్షనల్ ఐల్యాండ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించారు. ఇందులో కొరటాల శివ ఎలాంటి సామాజిక సందేశాన్ని మిళితం చేశారనేది తెలియదు. మరో వైపు గతంలో సోషల్ మీడియాలో కూడా కొరటాల సామాజిక, రాజకీయ అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తూ ఉండేవారు. అయితే దేవర సినిమాతో బిజీ అయ్యాక సోషల్ మీడియాలో అంత యాక్టివ్ గా ఉండటం లేదు.

ఇదిలా ఉంటే ఆగష్టు 14న కొరటాల శివ, మాజీ ఐఏఎస్ ఆఫీసర్ లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపకులు జయప్రకాశ్ నారాయణ్ తో పాడ్ కాస్ట్ వీడియోలో పాల్గొనబోతున్నారు. వీరిద్దరూ పాడ్ కాస్ట్ లో సామాజిక, రాజకీయ అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని జయప్రకాశ్ నారాయణ్ కన్ఫర్మ్ చేశారు. ఇండిపెండెన్స్ డే స్పెషల్ గా వీరు ఇండియన్ ఫ్రీడమ్ మూమెంట్స్ గురించి కూడా పాడ్ కాస్ట్ వీడియోలో మాట్లాడే అవకాశం ఉందంట.

అయితే ఇందులో కొరటాల ఏమైన దేవర మూవీ స్టోరీ గురించి చెప్పే అవకాశం ఉందా అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. కొరటాల శివ ఇంటర్వ్యూలలో మాట్లాడి చాలా రోజులు అయ్యింది. కంప్లీట్ గా దేవర సినిమాపైన దృష్టిపెట్టడంతో ఎక్కడ పెద్దగా మాట్లాడటం లేదు. ఇక చాలా రోజుల తర్వాత జయప్రకాశ్ నారాయణ్ తో చర్చించబోతున్నారు. మరి ఈ చర్చలో ఆయన ఎలాంటి విషయాలు చెబుతారో చూడాలి.