Begin typing your search above and press return to search.

అయ్యయ్యో.. కొరటాలకు 'కృష్ణమ్మ' షాక్..

ప్రముఖ దర్శకుడు కొరటాల శివ ఈ చిత్రాన్ని సమర్పించగా, ఆయన స్నేహితుడు కృష్ణ నిర్మించారు.

By:  Tupaki Desk   |   17 May 2024 7:32 AM GMT
అయ్యయ్యో.. కొరటాలకు కృష్ణమ్మ షాక్..
X

సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించిన 'కృష్ణమ్మ' ఇటీవల విడుదలై మంచి ప్రమోషన్స్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం రస్థిక్ థీమ్ తో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ ఈ చిత్రాన్ని సమర్పించగా, ఆయన స్నేహితుడు కృష్ణ నిర్మించారు. ఈ చిత్రం థియేటర్లలో పెద్దగా విజయం సాధించలేకపోయింది. కానీ సానుకూల సమీక్షలను అందుకుంది.

అయితే కొరటాల తీసుకున్న ఒక నిర్ణయం కారణంగా సినిమాకు మంచి ఆఫర్ మిస్సయినట్లు తెలుస్తోంది. అసలు ఈ కృష్ణమ్మ షూటింగ్ పూర్తి కావడానికి సంవత్సరానికి పైగా సమయం పట్టింది. రూ. 7 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రానికి థియేటర్ విడుదలకు ముందు రూ. 8 కోట్ల నాన్-థియేట్రికల్ రైట్స్ ఆఫర్ వచ్చిందట. కానీ, కొరటాల శివ దానికి రూ. 12 కోట్ల డిమాండ్ చేశారని ఒక టాక్ వచ్చింది.

ఇక చిత్రం పై ఎన్నో ఊహాగానాల మధ్య, చివరకు విడుదలై ఎలాంటి ఆశించిన ఫలితాలు ఇవ్వలేకపోయింది. 'ఆచార్య' చిత్రం ఫ్లాప్ అనంతరం, 'కృష్ణమ్మ' కూడా కమర్షియల్ గా కొరటాలకు నిరాశకు గురి చేసింది. నాన్-థియేట్రికల్ హక్కులు చివరికి రూ. 3 కోట్లకే క్లోజ్ కావడం జరిగిందట. ఇక ఆఫర్ మిస్ కావడంతో కొరటాల మళ్ళీ బ్యాక్ లో నిలబడ్డాడు. అయినప్పటికీ మైత్రి మూవీ మేకర్స్ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ సంస్థల ద్వారా నిర్మాత స్వయంగా ఈ చిత్రాన్ని విడుదల చేయాల్సి వచ్చింది.

ఇక అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు కొనుగోలు చేశారు. అయితే థియేట్రికల్ విడుదల నుండి కేవలం ఏడు రోజుల్లోనే ఈ చిత్రం స్ట్రీమింగ్ ప్రారంభమైంది. ఈ చిత్రానికి ఇంత తొందరగా డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లో ప్రదర్శించబడటం షాకింగ్ అనే చెప్పాలి. ఎందుకంటే మళ్ళీ అమెజాన్ ఆఫర్ మిస్సయితే మరికొంత నష్టాలు చూడాల్సి వచ్చేది. వాళ్ళు ముందు అనుకున్న డీల్ కంటే కొంత ఎక్కువ ఎమౌంట్ ఆఫర్ చేశారు. ఇక మరోవైపు థియేటర్స్ కు పెద్దగా జనాలు రావడం లేదు. సింగిల్ స్క్రీన్స్ కూడా క్లోజ్ అయ్యాయి. ఈ పరిస్థితుల నడుమ ఓటీటీ అడ్వాన్స్ డీల్ కు ఒప్పుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది.

కొరటాల శివ లాంటి వ్యక్తి నుండి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యం కలిగించింది. విడుదలకు ముందు మంచి లాభాల చిత్రంగా కనిపించిన 'కృష్ణమ్మ', విడుదల తర్వాత అంచనాలను అందుకోలేకపోయి, నిర్మాతలకు నష్టాలను మిగిల్చింది. సత్యదేవ్ తన నటనా ప్రతిభను చాటుకోవడానికి చేసిన ఈ ప్రయత్నం, కమర్షియల్ గా బాక్సాఫీస్ వద్ద నిరాశపర్చినా, ప్రేక్షకుల హృదయాల్లో మంచి గుర్తింపు తెచ్చింది.