Begin typing your search above and press return to search.

ఓటీటీ అప్డేట్‌ : వరల్డ్‌ సెన్షేషన్‌ సీక్వెల్

డిసెంబర్‌ 26 నుంచి నెట్‌ ఫ్లిక్స్ లో స్క్విడ్‌ గేమ్‌ సీజన్‌ 2ని స్ట్రీమింగ్‌ చేయబోతున్నట్లుగా నెట్‌ ఫ్లిక్స్ చేసిన ప్రకటనతో సిరీస్ ఫ్యాన్స్‌ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   1 Aug 2024 9:15 AM
ఓటీటీ అప్డేట్‌ : వరల్డ్‌ సెన్షేషన్‌ సీక్వెల్
X

ప్రపంచ వ్యాప్తంగా ఓటీటీ ప్రేక్షకులకు సుపరిచితం అయిన స్క్విడ్‌ గేమ్‌ వెబ్‌ సిరీస్‌ మరోసారి సందడి చేసేందుకు రెడీ అవుతోంది. ప్రముఖ ఓటీటీ నెట్‌ ఫ్లిక్స్ స్క్విడ్ గేమ్‌ సీజన్ 2 స్ట్రీమింగ్ తేదీని అధికారికంగా ప్రకటించారు.

డిసెంబర్‌ 26 నుంచి నెట్‌ ఫ్లిక్స్ లో స్క్విడ్‌ గేమ్‌ సీజన్‌ 2ని స్ట్రీమింగ్‌ చేయబోతున్నట్లుగా నెట్‌ ఫ్లిక్స్ చేసిన ప్రకటనతో సిరీస్ ఫ్యాన్స్‌ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. స్క్విడ్‌ గేమ్‌ సీజన్ 1 ను నెట్‌ ఫ్లిక్స్ లో 28 రోజుల్లోనే 1.65 బిలియన్ అవర్స్ స్ట్రీమింగ్‌ తో రికార్డ్‌ నమోదు చేసింది.

ఆరు ఎమ్మీ అవార్డులను సొంతం చేసుకోవడంతో పాటు ఎన్నో అంతర్జాతీయ స్థాయి అవార్డులను సొంతం చేసుకున్న స్క్విడ్‌ గేమ్‌ ను ఇండియాలో ప్రాంతీయ భాషల్లో కూడా డబ్‌ చేసి అందుబాటులో ఉంచడం వల్ల అత్యధికులు చూడటం జరిగింది.

పేదరికంలో కొట్టుమిట్టాడుతున్న 456 మంది ఎలాగైనా డబ్బు సంపాదించాలనే ఉద్దేశ్యంతో అత్యంత ప్రమాదకర ఆటలను ఆడేందుకు సిద్ధం అవుతారు. ఆ క్రమంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతారు. దాంతో ఎదుటి వారి ప్రాణాలు కాపాడుతూ, తమ ప్రాణాలు కాపాడుకునేందుకు కొందరు చేసే ప్రయత్నమే స్క్విడ్‌ గేమ్‌ కథ.

నెట్‌ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్‌ అవ్వబోతున్న సీజన్ 2 కూడా కచ్చితంగా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకంను సిరీస్ ప్రేక్షకులు మరియు ఫ్యాన్స్‌ వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో ఇప్పటి నుంచే ఈ వెబ్‌ సిరీస్‌ కోసం ఎదురు చూస్తున్నట్లుగా ఔత్సాహికులు పోస్ట్‌ చేస్తున్నారు.