Begin typing your search above and press return to search.

కొరియన్ స్టార్ మీద పడ్డ ప్రభాస్ ఫాన్స్ ! ఫ్యాన్స్ రచ్చేంటి?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రముఖ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో స్పిరిట్ మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   10 July 2024 8:10 AM GMT
కొరియన్ స్టార్  మీద పడ్డ ప్రభాస్ ఫాన్స్ ! ఫ్యాన్స్ రచ్చేంటి?
X

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రముఖ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో స్పిరిట్ మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఇంకా సెట్స్ పై వెళ్లకుండానే ఆ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అర్జున్‌ రెడ్డి, యానిమల్‌ మూవీస్ తో తన సత్తా ఏంటో చాటిన సందీప్‌ వంగా.. స్పిరిట్ మూవీని భారీగా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ ను పూర్తి చేస్తున్న ఆయన.. 2024 చివరలో సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.

అయితే అటు ప్రభాస్.. ఇటు సందీప్.. ఇద్దరూ కూడా సక్సెస్ జోష్ లో ఉన్నారు. దీంతో వీరి కాంబినేషన్ లో సినిమా అంటే.. ఫ్యాన్స్ తోపాటు సినీ ప్రియులు భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. స్పిరిట్ లో వైలెన్స్ భారీగా ఉంటుందని ఇప్పటికే పరోక్షంగా చెప్పారు సందీప్. అయితే స్పిరిట్ మూవీకి సంబంధించి ఎప్పటికప్పుడు వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా ఈ సినిమాలో కొరియన్ స్టార్ నటిస్తున్నట్లు టాక్ వచ్చిన విషయం తెలిసిందే.

దక్షిణ కొరియా స్టార్ మా డాంగ్ సియోక్ స్పిరిట్ మూవీలో విలన్ గా నటించనున్నారని జోరుగా చర్చ సాగుతోంది. మూవీ స్టోరీ అంతర్జాతీయ నేపథ్యంలో ఉంటుందని, అందుకే హాలీవుడ్‌ నటులపై సందీప్ దృష్టిసారించారని టాక్‌ వినిపిస్తోంది. అయితే ఇందులో నిజమెంతో తెలియదు. కానీ.. డాంగ్ సియోక్ ఇన్ స్టా పోస్టుల కామెంట్ సెక్షన్ లో ప్రభాస్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో సందడి చేస్తున్నారు. ప్రభాస్ తో నటించండి డాంగ్ అంటూ ఫ్యాన్స్ కోరుతున్నారు.

పాప్ కార్న్ తింటున్న వీడియోను రీసెంట్ గా డాంగ్ షేర్ చేయగా.. అసలు మీరు ప్రభాస్ తో స్పిరిట్ మూవీలో నటిస్తున్నారా అని మరికొందరు అడుగుతున్నారు. ప్రభాస్ స్పిరిట్ అంటూ ఫైర్ ఇమోజీలు పెడుతున్నారు. బాహుబలి, సలార్ లోని ప్రభాస్ మేనరిజమ్స్ ను GIFs రూపంలో కామెంట్స్ పెడుతున్నారు. కొరియన్ బాలయ్య అని ఇంకొందరు రచ్చ రచ్చ చేస్తున్నారు. బహుశా.. డాంగ్ కు అసలేం జరుగుతుందో తెలియకపోయి ఉండవచ్చు.

అయితే డాంగ్ సియోక్.. ద గుడ్ ద బ్యాడ్ ద వీర్డ్, ద రౌండప్, ద ఔట్ లాస్ వంటి పలు చిత్రాలతో నటుడిగా ఫుల్ ఫేమ్ సంపాదించుకున్నారు. ట్రైన్‌ టూ బూసాన్‌, మార్వెల్‌ సిరీస్‌ ఎటర్నల్‌ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మరి ఆయన.. ప్రభాస్‌ స్పిరిట్ లో నటిస్తున్నారో లేదో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకు వేచి చూడాలి. కానీ వైరల్ వార్తలు నిజమైతే మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ కు పండగే. మరేం జరుగుతుందో వెయిట్ అండ్ సీ.