నా తన్నుడికి వాడి నడ్డి ఇరిగిపోవాలి!
తెలుగు సినిమా చరిత్రలో వారిద్దరికి చెరిగిపోని సువర్ణాద్యాయం. ఒకరు తన వైవిధ్య నటనతో ఏ పాత్రకైనా ప్రాణం పోసే విలక్షణ నటుడు.
By: Tupaki Desk | 20 Oct 2024 4:30 PM GMTతెలుగు సినిమా చరిత్రలో వారిద్దరికి చెరిగిపోని సువర్ణాద్యాయం. ఒకరు తన వైవిధ్య నటనతో ఏ పాత్రకైనా ప్రాణం పోసే విలక్షణ నటుడు. మరొకరు కడుపుబ్బా నవ్వించే హాస్యంతో ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టే హాస్య నటుడు.. వారివురు కాంబినేషన్ లో ప్రేక్షకులు ఎంతగానో అలరించారు. వారే కోట శ్రీనివాసరావు- బాబు మోహన్. వారిద్దరు పోషించినే పాత్రలే వాళ్లని గొప్ప స్నేహితులుగా మలిచాయి.
అరేయ్ అని పిలచుకునే చనువు ఇద్దరి మధ్య ఉంది? కోటని..బాబు మోహన్ అభిమానంతా అన్నయ్యా? అని పిలుస్తారు. కోట సైతం బాబు మోహన్ ని అంతే అభిమానంతో అరేయ్ అంటూ పిలుస్తుంటారు. వీళ్లిద్దరు కలిసి దాదాపు 60 పైగా సినిమాల్లో జోడిగా నటించారు. కోట-బాబు మోహన్ కాంబినేషన్ అంటే ముందుగా నవ్వొస్తుంది. ఆ తర్వాతే సినిమా గుర్తొస్తుంది. అంతగా ప్రేక్షకుల హృదయాల్లో ఇద్దరు నిలిచిపోయారు.
ముఖ్యంగా ఓ చిత్రంలో కోట శ్రీనివాసరావు..బాబు మోహన్ పాత్రని హేళన చేస్తూ నడుంపై తన్నే సన్నివేశాలు అప్పటి ఆడియన్స్ ని ఎంతగా నవ్వించాయో తెలిసిందే. తాజాగా ఆ సినిమా ఎక్స్ పీరియన్స్ ని కోట పంచుకున్నారు. ` బాబు మోహన్ టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్. యాక్టింగ్, డాన్సు వచ్చు. మంచి డైలాగులు చెబుతాడు. మూడు నాలుగు రకాల విద్యలున్నాయి. కొన్ని సినిమాల్లో నేను తన్నిన తన్నుడికి వాడి నడుం విరిగిపోవాలి.
ఎప్పుడూ నా కాలు వాడి శరీరాన్ని తాకలేదు. వాడి షర్ట్ కి తగలగానే కింద పడిపోయేవాడు. అంత గొప్ప టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్. ఆ టైమింగ్ అందరికీ రాదు. కొందరు మాత్రమే అలా చేయగలరు. నాకు తెలిసిన గొప్ప ఆర్టిస్ట్ బాబు మోహన్. ఇద్దరం ఎంతో క్లోజ్ గా ఉంటాం. అన్న అంటూ ఎంతో అభిమానంతో పిలుస్తాడు. నేను కూడా అంతే అభిమానిస్తా` అని అన్నారు.