Begin typing your search above and press return to search.

బాక్సాఫీస్: కోట బొమ్మాళి vs ఆదికేశవ.. ఇది పరిస్థితి!

వాటిలో ఒకటి వైష్ణవ తేజ్, శ్రీ లీల జంటగా నటించిన 'ఆదికేశవ' కాగా మరొకటి శ్రీకాంత్, శివాని రాజశేఖర్, రాహుల్ విజయ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 'కోటబొమ్మాలిPS'.

By:  Tupaki Desk   |   26 Nov 2023 6:44 AM GMT
బాక్సాఫీస్: కోట బొమ్మాళి vs ఆదికేశవ.. ఇది పరిస్థితి!
X

గత శుక్రవారం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రెండు సినిమాలు పోటీ పడ్డాయి. ఆ రెండు సినిమాలకి ఆడియన్స్ లో మార్కెట్ లో పెద్దగా బజ్ లేకపోవడంతో వర్కౌట్ కావేమో అనుకున్నారు. ప్రమోషన్స్ లో అయితే గట్టిగానే పోటీ పడ్డారు. వాటిలో ఒకటి వైష్ణవ తేజ్, శ్రీ లీల జంటగా నటించిన 'ఆదికేశవ' కాగా మరొకటి శ్రీకాంత్, శివాని రాజశేఖర్, రాహుల్ విజయ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 'కోటబొమ్మాలిPS'.. ఈ రెండు సినిమాల బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ ఎలా ఉందో తెలుసుకుందాం..

మెగా మేనల్లుడు వైష్ణవ తేజ్, సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల, జీవి ప్రకాష్ కుమార్, సితార ఎంటర్టైన్మెంట్స్ వంటి టాప్ కాస్ట్ అండ్ క్రూ ఉండడంతో ఆదికేశవ మూవీ 'కోటబొమ్మాలిPS' మూవీపై పై చేయి సాధిస్తుందని చాలామంది భావించారు. కట్ చేస్తే, సీన్ రివర్స్ అయింది. 'ఆదికేశవ' రొటీన్ మూవీ కావడం, 'కోటబొమ్మాలిPS' మూవీలో శ్రీకాంత్, వరలక్ష్మి శరత్ కుమార్ తమ నటనతో పాటు ట్విస్టులతో ఆడియన్స్ ని బాగా ఎంగేజ్ చేయడంతో ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్స్ ని అందుకని ఆడియన్స్ లో పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది.

అంతేకాదు ఆదికేశవతో పోలిస్తే కోటబొమ్మాలికి శనివారం ఉదయం సాయంత్రం షోల బుకింగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఈ సినిమా బడ్జెట్ కి, వస్తున్న కలెక్షన్స్ కి నిర్మాతల నుంచి మంచి స్పందన వస్తోంది. సోమవారం కూడా ఇదే కొనసాగితే ఈ మూవీ సేఫ్ జోన్ లోకి వచ్చినట్లే అని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. అలాగే ఈ సినిమాలో ఉన్న పొలిటికల్ కంటెంట్ కి భారీ రెస్పాన్స్ వస్తోంది.

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావిడి ఉండడంతో సరిగ్గా ఎలక్షన్ ఫీవర్ లో మేకర్స్ ఈ సినిమాని రిలీజ్ చేసి సక్సెస్ అయ్యారనే చెప్పాలి. జోహార్ మూవీ ఫేమ్ తేజ మర్ని 'కోటబొమ్మాలిPS' మూవీ ని డైరెక్ట్ చేశాడు. మలయాళం లో సూపర్ హిట్ అయినా 'నాయట్టు' సినిమాకి కొన్ని మార్పులు చేర్పులు చేసి ఈ మూవీని తెరకెక్కించారు. సీనియర్ హీరో శ్రీకాంత్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్, వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు.

గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాస్, విద్యా కొప్పినీడి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆదికేశవ విషయానికి వస్తే, వైష్ణవ్ తేజ్ మొదటిసారి మాస్ క్యారెక్టర్ లో నటించిన సినిమా ఇది. శ్రీకాంత్ ఎన్ రెడ్డి అనే డెబ్యూ డైరెక్టర్ తెరకెక్కించిన ఈ మూవీ రొటీన్ కమర్షియల్ ఫార్మాట్ లో సాగడంతో ఆడియన్స్ ని ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది.