Begin typing your search above and press return to search.

అయ్యో... ఆ క్రేజీ సిరీస్ డిజాస్టర్‌

రెండు వారాల్లో కోట ఫ్యాక్టరీ కి కేవలం 2.4 మిలియన్‌ ల వ్యూస్ మాత్రమే రావడంతో ఇది డిజాస్టర్‌ వెబ్‌ సిరీస్‌ అంటూ ఓటీటీ కంటెంట్‌ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   4 July 2024 5:23 AM GMT
అయ్యో... ఆ క్రేజీ సిరీస్ డిజాస్టర్‌
X

సౌరభ్‌ ఖన్నా సారధ్యంలో రాఘవ్‌ సుబ్బు దర్శకత్వంలో రూపొంది గతంలో ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్‌ అయిన కోట ఫ్యాక్టరీ సీజన్ 1 మరియు కోట ఫ్యాక్టరీ సీజన్ 2 లకు మంచి స్పందన దక్కింది. ఓటీటీ ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకున్న ఈ వెబ్‌ సిరీస్ కి తాజాగా మూడో సీజన్‌ రూపొంది తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఎడ్యుకేషన్‌ సిస్టం గురించి ఈ వెబ్‌ సిరీస్ లో చూపించడం ద్వారా గతంలో యూత్‌ ని బాగా కనెక్ట్‌ చేయడం జరిగింది. కానీ సీజన్ 3 లో మాత్రం ప్రేక్షకులు మెచ్చే, ముఖ్యంగా యూత్‌ ఆడియన్స్ కనెక్ట్‌ అయ్యే అంశాలు తక్కువ అయ్యాయి అంటూ రివ్యూవర్స్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

గత వారం నెట్‌ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్‌ అవ్వడం ప్రారంభం అయిన కోటా ఫ్యాక్టరీ సీజన్‌ 3 కి అతి తక్కువ వ్యూస్ వస్తున్నట్లు సమాచారం అందుతోంది. మొదటి వారం రోజుల్లో ఈ వెబ్‌ సిరీస్ కు 1.3 మిలియన్ల వ్యూస్ రాగా, రెండో వారంలో కేవలం 1.1 మిలియన్ల వ్యూస్ మాత్రమే వచ్చాయట.

రెండు వారాల్లో కోట ఫ్యాక్టరీ కి కేవలం 2.4 మిలియన్‌ ల వ్యూస్ మాత్రమే రావడంతో ఇది డిజాస్టర్‌ వెబ్‌ సిరీస్‌ అంటూ ఓటీటీ కంటెంట్‌ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ వెబ్‌ సిరీస్‌ కు పోటీ అన్నట్లుగా అమెజాన్ లో స్ట్రీమింగ్‌ అవుతున్న పంచాయత్‌ సీజన్‌ 3 కి ఏకంగా 20 మిలియన్ల వ్యూస్ కంటే ఎక్కువగానే నమోదు అయ్యాయట.

ఈ మధ్య కాలంలో నెట్‌ ఫ్లిక్స్ లో సినిమాలకు మంచి ఆధరణ లభిస్తోంది కానీ, వెబ్‌ సిరీస్ ల విషయంలో మాత్రం వెనుక పడుతున్నాయి. ముఖ్యంగా హిందీ వెబ్‌ సిరీస్ లు కనీసం ఆన్ లైన్ లో కూడా టాప్‌ లో ఉండలేక పోతున్నాయి. రెండు వారాల క్రితం వచ్చిన కోట ఫ్యాక్టరీ అప్పుడే గ్లోబల్‌ ర్యాంకింగ్‌ లో 8వ స్థానంకు పడి పోవడంను బట్టి ఆ సిరీస్ ఫలితం ఏంటో అర్థం చేసుకోవచ్చు.