Begin typing your search above and press return to search.

అలాంటి వ్యవస్థని ఖండిస్తూ తీశాం..!

మలయాళంలో సూపర్ హిట్టైన నాయట్టు రీమేక్ గా తెలుగులో కోటబొమ్మాళి పి.ఎస్ సినిమా తెరకెక్కించారు.

By:  Tupaki Desk   |   21 Nov 2023 5:22 AM GMT
అలాంటి వ్యవస్థని ఖండిస్తూ తీశాం..!
X

మలయాళంలో సూపర్ హిట్టైన నాయట్టు రీమేక్ గా తెలుగులో కోటబొమ్మాళి పి.ఎస్ సినిమా తెరకెక్కించారు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో రూపొందించిన ఈ సినిమాను తేజ మార్ని డైరెక్ట్ చేశారు. ఈ నెల 24న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఈవెంట్ ని ప్రచార సభ అంటూ ప్రమోషన్స్ మొదలు పెట్టారు. ఈవెంట్ కు అల్లు అరవింద్ ముఖ్య అతిథిగా వచ్చారు. కోటబొమ్మాళి పి.ఎస్ గురించి అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ఈ కథ ఎవరు చెప్పని కథ.. మామూలుగా పోలీసులు క్రిమినల్స్ ని చేజ్ చేస్తుంటారు. కానీ ఇందులో పోలీసులు పోలీసులనే చేజ్ చేస్తుంటారు. విచిత్రమైన కథ అందుకే తనకు బాగా నచ్చిందని అన్నారు అల్లు అరవింద్.

ఈ సినిమాలో హీరోలు ఎవరు లేరు.. కథే హీరో ఈ వెరైటీ కథని ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నానని అన్నారు. ఈవెంట్ కి వచ్చిన బోయపాటి శ్రీను ఎక్కడో స్క్రిప్ట్ రాసుకుంటూ బిజీగా ఉన్నారు అయినా కూడా పిలవగానే వచ్చినందుకు థాంక్స్ అని చెప్పారు. సినిమాలో నటించిన శ్రీకాంత్ తమకు బాగా కావాల్సిన వాడు. పెళ్లిసందడి తో ఇంట్రడ్యూస్ చేశాం. ఎక్కడ అవకాశం ఉన్నా తను నటిస్తాడని అన్నారు.

ఇంత కాలం ఉండి ఇలా చేయగలగడం మా అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు అల్లు అరవింద్. కోట బొమ్మాళి పి.ఎస్ సినిమా పోలీసులను రాజకీయ నాయకులు ఎలా వాడుకుంటారు అనే కథతో ఏదో ఒక పేరు పెట్టాలని కోటబొమ్మాళి అని పెట్టాం ఇది ఏ పోలీసుని.. రాజకీయ నాయకుడిని ఉద్దేశించి తీసింది కాదని అన్నారు. ఆల్ ఇండియాలో ఉన్న ఈ వ్యవస్థని ఖండిస్తూ చేసిన ప్రయత్నం పోలీసులను న్యాయం చేయనివ్వరని చెప్పే కథ అని అన్నారు.

ఈ మెసేజ్ ఈ ఎలక్షన్ టైం లో తీసుకెల్లడం సందర్భం అలా కుదిరిందని అన్నారు. అందరు హీరోలు హీరోయిన్స్ ఇంట్రడ్యూస్ చేస్తారు కానీ నేను నిర్మాతలను ఇంట్రడ్యూస్ చేస్తాను. కనీసం ఒక 10 మంది నిర్మాతలను ఇంట్రడ్యూస్ చేయాలని ఉందని అన్నారు అల్లు అరవింద్.

ప్రమోషన్స్ తో కోటబొమ్మాళి పి.ఎస్ మీద అంచనాలు పెంచే ప్రయత్నం చేస్తున్నారు చిత్ర యూనిట్. లింగిడి లింగిడి సాంగ్ తో ఇప్పటికే సినిమాపై మంచి బజ్ ఏర్పడగా.. సినిమా ఆడియన్స్ కు రీచ్ అయితే మాత్రం మంచి సక్సెస్ అందుకునే ఛాన్స్ ఉంది.