క్రాంతి మాధవ్ 'DGL'.. యూత్ ను తెగ మెప్పిస్తోందిగా!
లవ్ జోనర్ లో తెరకెక్కిన సినిమాలకు ఎప్పుడూ స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంటుందన్న విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 3 Jan 2025 7:23 AM GMTలవ్ జోనర్ లో తెరకెక్కిన సినిమాలకు ఎప్పుడూ స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంటుందన్న విషయం తెలిసిందే. అలాంటి చిత్రాలు ఫీల్ గుడ్ గా ఉంటే కచ్చితంగా సూపర్ హిట్స్ గా నిలుస్తుంటాయి. అలాంటి ఎన్నో సినిమాలను డైరెక్టర్ క్రాంతి మాధవ్ ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. సినీ ప్రియులను ఎంతో మెప్పించారు.
ముఖ్యంగా క్రాంతి మాధవ్ సినిమాలంటే చాలు.. ప్రేక్షకులను కచ్చితంగా హత్తుకుంటాయి. అలా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఆయన.. ఇప్పుడు మరో మూవీ డీజీఎల్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఆధారంగా తెరకెక్కుతున్న ఆ సినిమా.. 2025లో థియేటర్లలో విడుదల కానుంది.
ఆర్థి క్రియేటివ్ టీమ్ బ్యానర్ పై గంటా కార్తిక్ రెడ్డి నిర్మిస్తున్న ఆ మూవీ.. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇప్పుడు న్యూ ఇయర్ సందర్భంగా మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. స్పెషల్ గ్లింప్స్ ను రిలీజ్ చేసింది. సినిమా స్టోరీని చిన్న గ్లింప్స్ ద్వారా రివీల్ చేశారు. మూవీ అంతా ఒక అందమైన కథగా ఉంటుందని క్లియర్ గా తెలుస్తోంది.
గ్లింప్స్ లో ఒక ఇంట్లో హీరో, హీరోయిన్ ను హగ్ చేసుకోవడాన్ని మాత్రమే చూపించారు మేకర్స్. అదే సమయంలో బ్యాక్ గ్రౌండ్ లో.. లవ్ 1 సైడ్ కాదు.. 2 సైడ్స్ కాదు.. అన్ని దిక్కులు దానివే.. లవ్ ఈజ్ బ్లడీ 360 డిగ్రీస్ అంటూ క్రేజీ డైలాగ్ వినిపిస్తుంది. హౌస్ ఎంతో అందంగా ఉందనే చెప్పాలి. ప్రస్తుతం గ్లింప్స్.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అయితే ఒక్క గ్లింప్స్ ద్వారా సినిమా ఎలా ఉంటుందో చిన్నగా క్లారిటీ ఇచ్చారు డైరెక్టర్ క్రాంతి మాధవ్. లవ్ స్టోరీ జోనర్ లో తన టాలెంట్ ను మరోసారి చూపించనున్నారని క్లియర్ గా తెలుస్తోంది. సినిమాలో ఒక రిలేషన్ షిప్ లో ఉన్న గొడవలు, ఇబ్బందులు, సంతోషాల గురించి చూపించనున్నట్లు సమాచారం.
ఫనీ కళ్యాణ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయిందనే చెప్పాలి. జ్ఞాన శేఖర్ సినిమాటోగ్రఫీ అట్రాక్ట్ చేస్తుంది. విజువల్స్ చాలా బాగున్నాయి. ఓవరాల్ గా గ్లింప్స్.. పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంటోంది. యూత్ కు తెగ ఆకట్టుకుంటోంది. అయితే హీరో, హీరోయిన్ ఎవరనేది మేకర్స్ చెప్పలేదు. గ్లింప్స్ లో అస్సలు తెలియడం లేదు. మరి డీజీఎల్ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో.. హీరో, హీరోయిన్లు ఎవరో వేచి చూడాలి.