Begin typing your search above and press return to search.

డైరెక్టర్ క్రిష్ సెకండ్ మ్యారేజ్.. నిజమేనా?

డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడికి టాలీవుడ్ లో ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ మార్క్ క్రియేట్ చేసుకున్నారు

By:  Tupaki Desk   |   7 Nov 2024 5:35 AM GMT
డైరెక్టర్ క్రిష్ సెకండ్ మ్యారేజ్.. నిజమేనా?
X

డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడికి టాలీవుడ్ లో ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ మార్క్ క్రియేట్ చేసుకున్నారు. ప్రతి సినిమా కూడా డిఫరెంట్ జోనర్ లో తెరకెక్కిస్తూ అలరిస్తుంటారు. తన చిత్రాల ద్వారా సామాజిక సందేశాన్ని ఇస్తూ మెప్పిస్తుంటారు. గమ్యం మూవీతో టాలీవుడ్ కు డైరెక్టర్ గా పరిచయమైన ఆయన.. ఓ ట్రెండ్ సెట్ చేశారు. ఆ తర్వాత వేదం మూవీతో విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకున్నారు.

కృష్ణం వందే జగద్గురుమ్, కంచె, గౌతమీపుత్ర శాతకర్ణి వంటి సినిమాలతో తన టాలెంట్ ఏంటో చూపించారు. బాలీవుడ్ లో ఠాగూర్ సినిమాను గబ్బర్ ఈజ్ బ్యాక్ పేరుతో రీమేక్ చేసి సత్తా చాటారు. ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు సినిమాలు తీసినా.. అవి బాక్సాఫీస్ వద్ద మెప్పించలేకపోయాయి. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ తో కంచె సినిమా చేసి ప్రశంసలు అందుకున్నారు. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరముల్లు చిత్రాన్ని స్టార్ట్ చేశారు.

కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్టు నుంచి మధ్యలో తప్పుకున్నారు. ఇప్పుడు స్టార్ హీరోయిన్ అనుష్కతో ఘాటి సినిమా చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లో షూటింగ్ పార్ట్ ను కూడా పూర్తి చేయనున్నారు. అదే సమయంలో రీసెంట్ గా సోషల్ మీడియాలో క్రిష్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి పలు వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. రెండో పెళ్లికి క్రిష్ సిద్ధమయ్యారని, త్వరలోనే జరగనుందని జోరుగా ప్రచారం సాగుతోంది.

దీనిపై క్రిష్ జాగర్లమూడి ఫ్యామిలీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దీంతో నెటిజన్లు.. క్రిష్ సాబ్ రెండో వివాహం మ్యాటర్ నిజమేనా అని క్వశ్చన్ చేస్తున్నారు. అయితే 2016లో రమ్య అనే డాక్టర్ ను వివాహం చేసుకున్నారు క్రిష్. కానీ ఐదేళ్ల తర్వాత కొన్ని కారణాల వల్ల పరస్పరం అంగీకారంతో క్రిష్, రమ్య విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి క్రిష్ సింగిల్ గానే ఉంటున్నారు.

దీంతో ఇప్పుడు కొత్త జీవితం ప్రారంభించడానికి క్రిష్ సిద్ధమయ్యారని ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పుడు కూడా డాక్టర్ నే వివాహం చేసుకోనున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆమె హైదరాబాద్ కు చెందిన వారని, వచ్చే వారం సింపుల్ గా ఎంగేజ్మెంట్ జరగనుందని ప్రచారం జరుగుతోంది. డిసెంబర్ లో వివాహం జరగనుందని సమాచారం. మరి క్రిష్ రెండో పెళ్లి వార్తల్లో నిజమెంత అనేది చూడాలి.