Begin typing your search above and press return to search.

క్రిష్ 4 డిలేకు 'ఆదిపురుష్' వైఫ‌ల్యం కార‌ణ‌మా?

క్రిష్ 4 చిత్రీకరణను ప్రారంభించే ముందు ఆదిపురుష్ ప్ర‌స్థావ‌న తేవ‌డంతో ఫెయిల్యూర్ ప్ర‌భావం ఎలా ఉందో అంద‌రికీ అర్థ‌మైంది.

By:  Tupaki Desk   |   6 Aug 2023 1:30 AM GMT
క్రిష్ 4 డిలేకు ఆదిపురుష్ వైఫ‌ల్యం కార‌ణ‌మా?
X

గత కొంత కాలంగా 'క్రిష్ 4' గురించి మీడియాలో ఆస‌క్తిక‌ర‌ క‌థ‌నాలొస్తున్నాయి. ఈ సంవత్సరం ప్రారంభంలో హృతిక్ క్రిష్ 4 సెట్స్ పైకి వెళుతుంద‌ని ధృవీకరించారు. అయినా దానికి విరుద్ధంగా ఈ చిత్రం గురించి ర‌క‌ర‌కాల ప్ర‌చారం సాగింది. భారతీయ సూపర్ హీరోగా హృతిక్ రోషన్ తిరిగి కంబ్యాక్ అవుతున్నాడ‌ని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా చిత్రనిర్మాత రాకేష్ రోషన్ నాల్గవ భాగం ఆలస్యం అయ్యే అవకాశం ఉందని వ్యాఖ్యానించ‌డం క‌న్ఫ్యూజ్ చేసింది. ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లే ముందు బ‌డ్జెట్ గురించి పెద్ద సినిమాల ఫెయిల్యూర్స్ గురించి దిగ్గజ నిర్మాత‌ ప్ర‌స్థావించారు. హాలీవుడ్ చిత్రాలతో పోలిస్తే క్రిష్ 4 కోసం తమ వద్ద 'చిన్న బడ్జెట్' మాత్ర‌మే ఉందని రాకేష్ రోష‌న్ ఇటీవల తన ఆందోళనలను వ్యక్తం చేశారు.

నిజానికి ఆదిపురుష్ లాంటి భారీబ‌డ్జెట్ చిత్రం వైఫ‌ల్యం చెంద‌డంతో ఆ ప్ర‌భావం రాకేష్ రోష‌న్ ఆలోచ‌న‌ల‌పై బ‌లంగా ప‌డింద‌ని కూడా విశ్లేషిస్తున్నారు. క్రిష్ 4 చిత్రీకరణను ప్రారంభించే ముందు ఆదిపురుష్ ప్ర‌స్థావ‌న తేవ‌డంతో ఫెయిల్యూర్ ప్ర‌భావం ఎలా ఉందో అంద‌రికీ అర్థ‌మైంది.

రాకేష్ రోషన్ మాట్లాడుతూ ''ప్రేక్షకులు ఇప్పటికీ థియేటర్‌లకు తిరిగి రాకపోవడం నాకు పెద్ద ప్రశ్నార్థకం'' అని ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేయ‌డ‌మే గాక‌.. ప్రపంచం చిన్నదైపోయింద‌ని 500-600 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో నిర్మించిన హాలీవుడ్ సూపర్ హీరో చిత్రాలను ఈ రోజు పిల్లలు చూడటం అలవాటు చేసుకున్నారని వాటితో పోల్చితే మా సినిమాకు రూ. 200-300 కోట్ల చిన్న బడ్జెట్ మాత్ర‌మే ఉందని వ్యాఖ్యానించారు. చిన్న బ‌డ్జెట్ల‌తో సినిమాకు ఆ (హాలీవుడ్) రేంజు లుక్ ఎలా ఇవ్వాలి? నేను 10కి బదులుగా 4 యాక్షన్ సీక్వెన్స్‌లే చేయాల‌ని నిర్ణయించుకోగలను. కానీ అది కూడా నాణ్యతతో హాలీవుడ్ కి స‌రిపోలాలి. VFX నాణ్యత బాగుండాలి. బడ్జెట్ ప్రొడ‌క్ట్ ఖర్చులు అన్నీ ఎలా నిర్వహించాలో చూస్తున్న‌దే. ఈ రోజుల్లో విడుదలైన పెద్ద సినిమాలు అంతగా ఆడటం లేదు... అని రాకేష్ రోష‌న్ అన్నారు.

క్రిష్ 4 గురించి హృతిక్ రోషన్ గ‌తంలో ఒక పోర్టల్‌తో మాట్లాడుతూ.. క్రిష్ 4 కోసం ప్రతిదీ సెట్ చేసామ‌ని.. మనమంతా ప్రార్థనలు పంపాలని వ్యాఖ్యానించారు. అయితే మేకర్స్ ఒక చిన్న సాంకేతికత గురించి ఎటూ క‌ద‌ల్లేక‌ ఇరుక్కుపోయార‌ని తెలిపారు.

ఏడాది చివరి నాటికి సమస్యను అధిగమిస్తారని అత‌డు ఆశాభావం వ్యక్తం చేశారు. తరువాత ఆ మాట నిజ‌మైంది. క్రిష్ 4 త్వ‌ర‌లో సెట్స్ కెళుతుంది. అయితే అది ఎప్పుడు అన్న‌దానికి ఇంకా పూర్తి స్ప‌ష్ఠ‌త లేదు.