సౌత్ మార్కెట్ పై క్రిష్-4 గురి!
సౌత్ మార్కెట్ పై బాలీవుడ్ హీరోలు గురి పెట్టిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 5 Nov 2023 1:30 PM GMTసౌత్ మార్కెట్ పై బాలీవుడ్ హీరోలు గురి పెట్టిన సంగతి తెలిసిందే. అందుకే ఈ మధ్య కాలంలో ఏ హిందీ సినిమా అయినా దక్షిణాది రాష్ట్రాల్లోనూ గట్టిగా ప్రచారం చేస్తున్నారు. హైదరాబాద్..చెన్నై..బెంగుళూరు అంటూ బాలీవుడ్ హీరోలు రిలీజ్ కి ముందు రౌండ్లు వేస్తున్నారు. ఆయా ఇండస్ట్రీలో తమకున్న పరిచయా ల్ని సైతం పుల్లుగా వాడేస్తున్నారు. ఈ విధంగా సక్సెస్ అయిన తొలి హీరో షారుక్ ఖాన్. తెలివిగా అట్లీతో జవాన్ ప్రాజెక్ట్ సెట్ చేసి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు.
అంతకు ముందు అమీర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డాతో సౌత్ లో పాగా వేయాలని చూసిన ఫలితం నిరాశపరిం చింది. అమితాబచ్చన్ సహా మిగతా నటులంతా తెలుగు సినిమా అవకాశాలు వస్తే విడిచిపెట్టడం లేదు. నో అనకుండా నటించేస్తున్నారు. సల్మాన్ ఖాన్ సైతం గెస్ట్ అపిరియన్స్ లో ఇస్తున్నాడు. అలాగే హృతిక్ రోషన్ కూడా సౌత్ ని..అందులోనూ టాలీవుడ్ ని గట్టిగానే టార్గెట్ చేసారు. అందుకే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని `వార్-2` చిత్రం కోసం రంగంలోకి దించుతున్నాడు.
ఈ కాంబినేషన్ లో `వార్ -2` ఎప్పుడైనా పట్టాలెక్కే అవకాశం ఉంది. యుద్ద భూమిలో వెయిట్ చేస్తున్నానం టూ హృతిక్ ..తారక్ కి ఓ సందేశం పంపించాడు. ఈ నేపథ్యంలో హృతిక్ సౌత్ మార్కెట్ ని మరింత బలంగా టార్గెట్ చేసే వ్యూహంలో ఉన్నాడా? అంటే అవుననే టాక్ వినిపిస్తుంది. హృతిక్ హీరోగా క్రిష్ -4 చిత్రం వచ్చే ఏడాది ప్రారంభం కానుంది. క్రిష్ ప్రాంచైజీ నుంచి భారీ అంచనాల మద్య రూపొందుతున్న చిత్రమిది. రాకేష్ రోషన్ అండ్ కో చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేస్తున్నారు.
దీనిలో భాగంగా ఈ చిత్రంతో సౌత్ మార్కెట్ బలంగా పాగా వేసే ప్రణాళిక రచిస్తున్నట్లు సమాచారం. క్రిష్-4 లో బాలీవుడ్ నటీనటులతో పాటు టాలీవుడ్..కోలీవుడ్ కి చెందిన నటుల్ని కూడా కీలక పాత్రలకు ఎంపిక చేసి పాన్ ఇండియాలో చిత్రాన్ని భారీ ఎత్తున రిలీజ్ చేయాలనే ఆలోచన లో ఉన్నట్లు మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. `వార్ -2` కూడా అదే రేంజ్ లో ప్లానింగ్ జరుగుతోన్న నేపథ్యంలో హిట్ ప్రాంచైజీ `క్రిష్-4 `ని అంతకు మించి ప్లాన్ చేస్తారు? అనడంలో ఎలాంటి డౌట్ లేదు.