Begin typing your search above and press return to search.

వీరమల్లు కూడా ఆయన చేతుల్లో పెట్టేస్తారా..?

క్రిష్ కూడా ఒక ప్రాజెక్ట్ మీద ఇన్నేళ్లు టైం వేస్ట్ అనుకుని చిన్నగా సైడ్ అయిపోయాడు.

By:  Tupaki Desk   |   23 July 2024 6:30 AM GMT
వీరమల్లు కూడా ఆయన చేతుల్లో పెట్టేస్తారా..?
X

పవన్ కళ్యాణ్ కెరీర్ లో తన స్టైల్ కి భిన్నంగా ప్రయత్నించిన సినిమాలు చాలా తక్కువ. ఐతే క్రిష్ డైరెక్షన్ లో హరి హర వీరమల్లు అంటూ ఒక సినిమా మొదలు పెట్టారు. ఆ సినిమాను ఏ.ఎం రత్నం నిర్మిస్తున్నారు. సినిమా సెట్స్ మీదకు వెళ్లేప్పుడు ఉత్సాహంగానే వెళ్లినా ఆ తర్వాత ఎందుకో సినిమాకు పరిస్థితులు అనుకూలించలేదు. ఓ పక్క పవన్ రాజకీయాల్లో బిజీ అవ్వడం వల్ల అనుకున్న డేట్స్ ఇవ్వలేకపోయాడు. ఫలితంగా సినిమా నాలుగేళ్లుగా సెట్స్ మీద ఉంది. క్రిష్ కూడా ఒక ప్రాజెక్ట్ మీద ఇన్నేళ్లు టైం వేస్ట్ అనుకుని చిన్నగా సైడ్ అయిపోయాడు.

ప్రస్తుతం ఆ సినిమాను ఏ.ఎం రత్నం తనయుడు జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేస్తున్నాడు. వీరమల్లు సినిమా నుంచి రీసెంట్ గా ఒక టీజర్ రిలీజ్ చేశారు. హరి హర వీరమల్లు ఫస్ట్ పార్ట్ అంటూ గ్లింప్స్ వదిలి సినిమా డైరెక్ట గా జ్యోతి కృష్ణ పేరు వేశారు. పవన్ ఈ సినిమా కోసం ఎప్పుడు డేట్స్ ఇస్తాడా అని చిత్ర యూనిట్ ఎదురుచూస్తుంది. ఐతే ఈ సినిమా విషయంలో గురూజీ త్రివిక్రం ఇన్వాల్వ్ మెంట్ కూడా కోరుతున్నాడట పవన్ కళ్యాణ్.

తెర మీద పవన్ కనిపిస్తున్నా ఆయన వెనక త్రివిక్రం సపోర్ట్, ఆయన ఐడియాలజీ ఉంటుంది. సినిమాలతో మొదలైన వీరి ఫ్రెండ్ షిప్ ఆఫ్ స్క్రీన్ రియల్ లైఫ్ లో కూడా కొనసాగుతుంది. వీరమల్లు సినిమా అనుకున్న టైం కు పూర్తి చేయాలంటే అది త్రివిక్రం వల్లే అవుతుంది. ఆయన అయితేనే పవన్ ని కన్విన్స్ చేసి సినిమా పూర్తి చేస్తాడు. అందుకే గురూజీ చేతుల్లోనే ఈ ప్రాజెక్ట్ కూడా పెట్టే ఆలోచనలో ఉన్నారని టాక్. అజ్ఞాతవాసి తర్వాత పవన్ త్రివిక్రం కలిసి ఒక ప్రాజెక్ట్ కూడా చేయలేదు కానీ.. పవన్ చేస్తున్న ప్రతి సినిమాకు ఇన్ డైరెక్ట్ గా సపోర్ట్ అందిస్తున్నాడు త్రివిక్రం.

గుంటూరు కారం తర్వాత త్రివిక్రం అల్లు అర్జున్ తో సినిమా చేస్తాడని టాక్ నడుస్తుంది. ఐతే తానేం సినిమా చేసినా సరే పవన్ కోసం ఆలోచిస్తూ ఉంటాడు త్రివిక్రం. ఈ క్రమంలో పవన్ వీరమల్లు సినిమాకు కూడా త్రివిక్రం పర్యవేక్షణ ఉంటుందని అంటున్నారు. ఐతే ఎవరైనా చేయండి కానీ సినిమాను త్వరగా రిలీజ్ చేయండని పవర్ స్టార్ ఫ్యాన్స్ కోరుతున్నారు.