Begin typing your search above and press return to search.

క్రిష్ ప్రొడక్షన్ లో మెగా హీరో క్రేజీ కాంబో

డిఫరెంట్ కథలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి.

By:  Tupaki Desk   |   26 May 2024 2:16 PM GMT
క్రిష్ ప్రొడక్షన్ లో మెగా హీరో క్రేజీ కాంబో
X

డిఫరెంట్ కథలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి. ఈ దర్శకుడు పవన్ కళ్యాణ్ తో రెండేళ్ల క్రితం హరిహరవీరమల్లు సినిమా స్టార్ట్ చేశారు. అయితే ఈ సినిమా ఎంతకీ పూర్తి కాకపోవడంతో ఆ ప్రాజెక్ట్ బాధ్యతల నుంచి తప్పుకొని ఫీమేల్ ఒరియాంటెడ్ చిత్రాన్ని అనుష్క తో స్టార్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

మరో వైపు నిర్మాతగా ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రాజీవ్ రెడ్డితో కలిసి సినిమాలు చేస్తున్నాడు. ఇప్పుడు ఈ ప్రొడక్షన్ లో వరుణ్ తేజ్ హీరోగా ఓ సినిమా పట్టాలు ఎక్కనున్నట్లు టాక్ వినిపిస్తోంది. క్రిష్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ కంచె మూవీ చేశారు. ఈ సినిమా కమర్షియల్ సక్సెస్ కాకపోయిన విమర్శకుల ప్రశంసలు సొంతం చేసుకుంది.

ఈ సారి ప్రొడ్యూసర్ గా వరుణ్ తేజ్ చిత్రాన్ని క్రిష్ నిర్మించబోతున్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో కంప్లీట్ కామిక్ బేస్డ్ కథాంశంతో ఈ చిత్రం ఉండబోతోందని తెలుస్తోంది. ఇప్పటికే స్క్రిప్ట్ లాక్ చేసారంట. త్వరలో మూవీ ప్రీప్రొడక్షన్ వర్క్ కూడా మొదలవుతుందని సమాచారం. వచ్చే ఏడాది ఆరంభంలో మూవీ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందంట.

వరుణ్ తేజ్ చివరిగా ఆపరేషన్ వాలంటైన్ మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. కరుణ్ కుమార్ దర్శకత్వంలో మట్కా అనే సినిమాని ఎనౌన్స్ చేసి సెట్స్ పైకి తీసుకొని వెళ్ళాడు. వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ జోనర్ లో మాస్ యాక్షన్ మూవీగా ఆ చిత్రం తెరకెక్కనుంది. వైరా ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించడానికి రెడీ అయ్యింది.

అయితే బడ్జెట్ కారణంగా సినిమా కొంతకాలం ఆగింది. మళ్ళీ సమస్యలు అన్ని పరిష్కరించుకొని సెట్స్ పైకి తీసుకొని వెళ్ళబోతున్నారంట. వచ్చే వారం నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూట్ స్టార్ట్ కాబోతోందని టాక్ వినిపిస్తోంది. మట్కా రిలీజ్ తర్వాత క్రిష్ నిర్మాణంలో మేర్లపాక గాంధీ దర్శకత్వంలో చేయబోయే సినిమాని వరుణ్ తేజ్ స్టార్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. మరో వైపు క్రిష్ అనుష్కతో చేస్తోన్న ఫీమేల్ సెంట్రిక్ మూవీ షూటింగ్ వీలైనంత వేగంగా కంప్లీట్ చేసి ఈ ఏడాదిలోనే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది.