కృష్ణారావు ఈసారి గట్టిగానే ప్లాన్ చేసాడా?
కోవీడ్ సమయంలో సినిమా ఓటీటీలో రిలీజ్ అవ్వడంతో సాధారణ జనానికి రీచ్ అవ్వలేదు.
By: Tupaki Desk | 24 Sep 2024 5:35 AM GMTఇండస్ట్రీలో వారసుల ఎంట్రీ కొత్తేం కాదు. సక్సెస్ అయిన వాళ్లు సక్సెస్ దిశగా సినిమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. పెయిలైన వాళ్లలో కొందరు కొనసాగుతున్నారు. మరికొంత మంది ఇతర వ్యాపారాల్లో బిజీ అవుతున్నారు. అలా వచ్చిన వాళ్లలో నటుడు గౌతమ్ రాజు కుమారుడు కృష్ణ కూడా ఒకరు. 'కృష్ణారావు సూపర్ మార్కెట్' అనే సినిమాతో తెరంగేట్రం చేసాడు. ఆ సినిమా నటుడిగా మంచి గుర్తింపును తీసుకొచ్చింది.
తొలి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. కోవీడ్ సమయంలో సినిమా ఓటీటీలో రిలీజ్ అవ్వడంతో సాధారణ జనానికి రీచ్ అవ్వలేదు. ఆ తర్వాత మళ్లీ కొత్త సినిమా చేయడానికి ఐదేళ్లు పట్టింది. ప్రస్తుతం `కిలాడీ కుర్రాళ్లు` అనే ఓ సినిమా చేస్తున్నాడు. ఔట్ పుట్ పై దీమా గా ఉన్నాడు. ఇప్పటికే షూటింగ్ సహా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయ్యాయి. ఈసారి నేరుగా థియేటర్లలో ఆడియన్స్ ని పలకరించనున్నాడు.
అయితే ఈ సినిమా రిలీజ్ కి ముందే నాలుగైనదు సినిమాలు లైన్ లో పెట్టినట్లు సమాచారం. తొలిసారి దొర్లిన తప్పిదాల్ని మళ్లీ దొర్లకుండా ముందే జాగ్రత్త పడుతున్నాడు. తొలి సినిమా చేసిన సమయంలో కరోనా కారణంగా సినిమాలు చేయలేదు. అలాగే కొత్త సినిమాలు కూడా కమిట్ అవ్వలేదు. దీంతో సమయమంతా వృద్ధాగా పోయింది. కానీ ఈసారి మాత్రం ప్రీ ప్లాన్డ్ గానే బరిలోకి దిగుతున్నాడు.
హీరో పీచర్స్ అన్నీ కృష్ణలో ఉన్నాయి. సరైన కథలు పడితే మంచి పేరు తెచ్చుకోగల సమర్ధుడే. తండ్రి కమెడియన్ అయినా కొడుకును మాత్రం హీరోను చేస్తున్నాడు. బ్యాకెండ్ లో గౌతం రాజు ఎపెర్ట్ ఎంతో ఉంది. తనయుడి ఎదుగుదల కోసం తాను చేయాల్సిందల్లా చేస్తున్నారు.