Begin typing your search above and press return to search.

ఆ కథ ప్రభాస్ తో తప్ప మరొకరితో చేయలేను

టాలీవుడ్ లో క్రియేటివ్ డైరెక్టర్ అంటే వెంటనే గుర్తుకొచ్చే పేరు కృష్ణవంశీ. క్లాస్, మాస్ కథలతో సినిమాలు చేసి కృష్ణవంశీ సక్సెస్ లు అందుకున్నారు

By:  Tupaki Desk   |   18 Oct 2024 5:14 AM GMT
ఆ కథ ప్రభాస్ తో తప్ప మరొకరితో చేయలేను
X

టాలీవుడ్ లో క్రియేటివ్ డైరెక్టర్ అంటే వెంటనే గుర్తుకొచ్చే పేరు కృష్ణవంశీ. క్లాస్, మాస్ కథలతో సినిమాలు చేసి కృష్ణవంశీ సక్సెస్ లు అందుకున్నారు. ఆయన ఇండస్ట్రీలో గుర్తుండిపోయే అద్భుతమైన మూవీస్ ఎలా చేసాడో అలాగే ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ డిజాస్టర్స్ గా నిలిచిన చిత్రాల జాబితాలో కూడా కృష్ణవంశీ సినిమాలుంటాయి. అయితే కృష్ణవంశీ రైటింగ్ టాలెంట్ గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది.

ఆయన చివరిగా ‘రంగమార్తాండ’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ మూవీ ప్రేక్షకులని పెద్దగా మెప్పించలేదు. ఇదిలా ఉంటే కృష్ణవంశీ బ్లాక్ బస్టర్ చిత్రాలలో ‘ఖడ్గం’ ఒకటి. ఈ సినిమా రీరిలీజ్ అవుతోంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా కృష్ణవంశీ ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ తో మూవీ గురించి ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేశారు. ప్రభాస్ కోసం ముందుగా నేను అదిరిపోయే మాస్ కథని సిద్ధం చేసాను.

అయితే తాను మాత్రం క్లాస్ స్టోరీ కావాలని అడిగారు. అందుకే మరల ‘చక్రం’ కథ రాసి అతనితో చేసాను. అయితే ప్రభాస్ కోసం రాసిన మాస్ కథ ఇప్పటికి అలాగే ఉంది. అతనికి మాత్రమే ఆ కథ సెట్ అవుతుంది. ప్రస్తుతం ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా దూసుకుపోతున్నాడు. ఫుల్ బిజీగా ఉన్నాడు. అతని డేట్స్ దొరకడం అంటే కష్టం. అనుకుంటే నేను ఒకటి, రెండు రోజుల్లోనే షూటింగ్ స్టార్ట్ చేసేసే రకం.

అందుకే ఇప్పుడంటే మా ఇద్దరి కాంబినేషన్ సెట్ కాదు. అలా అని వేరొక దర్శకుడికి ఆ కథ ఇవ్వలేను అని కృష్ణవంశీ చెప్పారు. ఆయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ ప్రస్తుతం సినిమాలు కూడా లార్జర్ దెన్ లైఫ్ లా ఉండే కథలతో చేస్తున్నాడు. చేతిలో ఏకంగా ఐదు సినిమాలు ఉన్నాయి. మరో వైపు కొత్త కథలు కూడా వింటున్నాడు.

ఇక కృష్ణవంశీ చూసుకుంటే వరుసగాగా ఫ్లాప్ లతో డౌన్ అయిపోయారు. వీరిద్దరి కాంబినేషన్ లో మూవీ సెట్ కావడం కష్టం అని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే కృష్ణవంశీ టాలెంట్ నమ్మేవారు మాత్రం ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘ఖడ్గం’ లాంటి మూవీ మరొకటి చేయమని సోషల్ మీడియాలో నెటిజన్లు రిక్వెస్ట్ చేస్తున్నారు.