Begin typing your search above and press return to search.

గోదావరి గ్యాంగ్ జోష్.. సీక్వెల్ కన్ఫర్మ్ చేసిన డైరెక్టర్..!

ఈ క్రమంలో విశ్వక్ సేన్, డైరెక్టర్ కృష్ణ చైతన్య మీడియాతో తమ సంతోషాన్ని పంచుకున్నారు.

By:  Tupaki Desk   |   31 May 2024 2:54 PM GMT
గోదావరి గ్యాంగ్ జోష్.. సీక్వెల్ కన్ఫర్మ్ చేసిన డైరెక్టర్..!
X

మాస్ అనే పేరును స్క్రీన్ నేమ్ గా మార్చుకున్న యువ హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ లీడ్ రోల్ లో కృష్ణ చైతన్య డైరెక్షన్ లో వచ్చిన సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. నేహా శెట్టి, అంజలి హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందించారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సమక్షంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమా నిర్మించారు. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్ చూసి చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ క్రమంలో విశ్వక్ సేన్, డైరెక్టర్ కృష్ణ చైతన్య మీడియాతో తమ సంతోషాన్ని పంచుకున్నారు.

తెలుగు ఆడియన్స్ ఎప్పుడు థియేటర్లో సినిమాను ఆదరించడంలో ముందుంటారు.. కొన్నాళ్లుగా దేశంలో వసూళ్ల పరంగా థియేటర్ల దగ్గర సందడి కనిపించలేదు. కొంత గ్యాప్ తర్వాత మళ్లీ మా సినిమాకు ప్రేక్షకులు థియేటర్ల బాట పట్టడం సంతోషంగా ఉందని అన్నారు విశ్వక్ సేన్. అంతేకాదు సినిమా చూసి నిజాయితీగా రివ్యూస్ ఇవ్వడంలో తప్పులేదు కానీ కొందరు సినిమా చూడకుండానే రివ్యూస్ రాస్తున్నారు. ఇంకొంతమంది కావాలని నెగిటివ్ రివ్యూస్ రాస్తున్నారు. అలాంటి వారిని పట్టించుకోకుండా సినిమా చూసేందుకు రావాలని అన్నారు విశ్వక్ సేన్.

తన సినిమాల ఎంపిక డిఫరెంట్ గా ఉంటాయనే ప్రశంసలు రావడం ఆనందంగా ఉంది. తనకు ఏదైనా ఛాలెంజింగ్ గా అనిపిస్తేనే చేస్తా.. రాబోయే రోజుల్లో కూడా అలానే చేస్తానని అన్నారు విశ్వక్ సేన్. సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూసి చాలా హ్యాపీగా ఉందని త్వరలోనే సినిమాకు సంబంధించిన సక్సెస్ మీట్ ఏర్పాటు చేస్తామని అన్నారు.

ఇదే ప్రెస్ మీట్లో డైరెక్టర్ కృష్ణ చైతన్య మాట్లాడుతూ.. సినిమాకు ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తే చాలా సంతోషంగా ఉందని అన్నారు. యూత్ ఆడియన్స్ అంతా యాక్షన్, డైలాగ్స్ ని ఎంజాయ్ చేస్తున్నారు. మహిళా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. సెకండ్ హాఫ్ ఎమోషనల్ సీన్స్ బాగా కనెక్ట్ అయ్యాయని చెబుతున్నారు అందుకు చాలా ఆనందంగా ఉందని అన్నారు.

బాలకృష్ణ గారు వారి ఫ్యామిలీతో సహా సినిమా చూసి చాలా బాగుందని అభిమందించారు. వారి ప్రశంసలు తనకు మాటల్లో చెప్పలేని ఆనందాన్ని ఇచ్చాయని అన్నారు కృష్ణ చైతన్య. సినిమాకు సంబంధించిన అన్ని ఏరియాల డిస్ట్రిబ్యూటర్స్ నుంచి రిపోర్ట్ చాలా హ్యాపీగా ఉందని అంటూ ఇదే జోష్ లో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాకు సీక్వెల్ ఉంటుందని ఆ వివరాలు త్వరలో చెబుతామని అన్నారు కృష్ణ చైతన్య.